News

క్లాసికల్ డాన్స్ తో అదరగొట్టిన శ్రీలీల, వీడియో చూసి ఫిదా అవుతున్న ఫాన్స్.

అమెరికాలో పుట్టిన తెలుగు మూలులున్న అమ్మాయి శ్రీలీల. చిన్నతనంలో భరతనాట్యం నేర్చుకుంది. అప్పట్లో ఈమె ఫెర్ఫార్మ్ చేసింది. ఆ వీడియో ఇప్పటికీ యూట్యూబ్‌లో ఉంది. కావాలంటే సెర్చ్ చేసి చూడొచ్చు. ఇక సినిమాల్లోకి వచ్చిన క్లాస్ డ్యాన్సులు పక్కనబెట్టి మాస్ డ్యాన్సులు చేయడం షురూ చేసింది. దీంతో పాత శ్రీలీలని చాలామంది మిస్ అయ్యారు. తాజాగా శ్రీలీల క్లాసికల్ డ్యాన్స్‌లో అదరగొట్టింది.

అమెరికాలో పుట్టిన శ్రీలీల చిన్నప్పటి నుంచి క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకుంది. ఇటీవల జరిగిన సమత కుంభ్‌-2024 లో ఆమె తన ప్రదర్శనతో అందరినీ అలరించింది.గోదాదేవిగా ఆమె అభినయానికి వీక్షకులు ఫిదా అయ్యారు. దాదాపు 10 నిమిషాల పాటు నాన్‌స్టాప్‌గా ఫెర్ఫార్మ్ చేసి వావ్ అనిపించింది. ఇక ఈవీడియోను ముద్దుగుమ్మ శ్రీలీల ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తూ.. ఇలా క్యాప్షన్ ఇచ్చింది. మీకు తెలుసో లేదో నా చిన్నప్పటి నుంచే క్లాసికల్ డ్యాన్స్‌తో నా జర్నీ స్టార్ట్ అయ్యింది.

నేను నా చిన్నతనం నుంచే మా టీమ్‌తో కలిసి ఆలయాల్లో ప్రదర్శనలు ఇవ్వడానికి వెళ్లేదాన్ని, అప్పటి నుంచే నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. ఆ రోజుల్లో నుంచే డ్యాన్స్ అనేది నా జీవితంలో ఒక హాబీగా మారిపోయింది. చాలా ఏళ్ల తర్వాత మళ్లీ ఇలాంటి ప్రదర్శన చేయడం కొత్తగా అనిపించింది. దాదాపు 10-15ఏళ్ల తర్వాత స్టేజ్‌పై ప్రదర్శన ఇవ్వడం ఇదే తొలిసారి.

గోదాదేవి అంటే మహిళల్లో రత్నం లాంటిదని అర్థం. ఆమె గాథ ఎంతో అందంగా ఉంటుంది. ఈ ప్రదర్శన ఎంతో ప్రత్యేకంగా అనిపించిందని చెప్పుకొచ్చింది. ఇక ప్రస్తుతం శ్రీలీలకు సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker