News

ఒక్క రోజుకి శ్రీముఖి సంపాదన ఎంతో తెలిస్తే షాక్ అవుతారు..?

రియాలిటీ షో అయిన బిగ్ బాస్ వంటి షోలతో మరింత క్రేజ్ సంపాదించుకుంది శ్రీముఖి.అనంతరం బ్యాక్ టు బ్యాక్ టీవీ షో లతో మరింత బిజీగా మారింది. యాంకరింగ్ తో పాటు వచ్చిన అవకాశాన్ని వదులుకోకుండా సినిమాల్లో సైతం మెరుస్తూ తన సత్తా చూపెడుతోంది. అయితే సోషల్ మీడియాలో సూపర్ యాక్టివ్ గా ఉండే శ్రీముఖి ఎప్పటికప్పుడు తన హాట్ ఫోటోషూట్లతో కుర్రకారులకు నిద్ర లేకుండా చేస్తుంది. తన అందాల ఆరబోతులో ఎలాంటి హద్దులు లేకుండా స్కిన్ షో చేస్తోంది శ్రీముఖి.

ఇదిలా ఉంటే శ్రీముఖి ఒకరోజు సంపాదన ఎంత అన్న విషయాన్ని తెలుసుకోవడానికి చాలామంది ఆసక్తి చూపుతున్నారు. అయితే బుల్లితెర మీద శ్రీముఖి హవా కొనసాగుతుంది. అనతికాలంలో శ్రీముఖి స్టార్ యాంకర్ గా ఎదిగారు. అరడజనుకు పైగా షోలకు శ్రీముఖి యాంకర్ గా చేస్తుంది. సుమ కూడా శ్రీముఖి తర్వాతే. సుమ ఈ మధ్య షోలు తగ్గించారు. కేవలం సుమ అడ్డా పేరుతో ఒక షో చేస్తున్నారు. శ్రీముఖి మాత్రం దూసుకుపోతున్నారు. రష్మీ సైతం శ్రీముఖితో పోటీపడలేకపోతుంది.

గ్లామరస్ యాంకర్ గా తనకు తిరుగులేదని నిరూపించుకుంటుంది. ఆమెకున్న డిమాండ్ రీత్యా భారీగా సంపాదిస్తుందట. ఒక అంచనా ప్రకారం శ్రీముఖి సంపాదన రోజుకు రూ. 3-5 లక్షల ఉంటుందట. ఒక్కో కాల్షీట్ కి మూడు లక్షలు తీసుకుంటుందట. ఒకే రెండు షిఫ్టులు పని చేస్తే డబుల్ రెమ్యూనరేషన్ పొందుతుంది. ప్రమోషన్స్, సోషల్ మీడియా యాడ్స్, ఈవెంట్స్ ద్వారా మరికొంత ఆర్జిస్తోంది. ఆమెకు కొన్ని వ్యాపారాలు కూడా ఉన్నాయి. మొత్తంగా శ్రీముఖి నెలకు కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారని పరిశ్రమ వర్గాల వాదన. ఆమె సంపాదన హీరోయిన్స్ ని మించిపోయిందని అంటున్నారు.

చూస్తుంటే ఆస్తుల్లో యాంకర్ సుమను కూడా శ్రీముఖి బీట్ చేసేలా ఉంది. యాంకర్ గా రాణిస్తూనే నటిగా ప్రయత్నాలు చేస్తుంది. హీరోయిన్ కావడమే లక్ష్యంగా ముందుకు వెళుతుంది. చిన్నాచితకా చిత్రాల్లో ఆఫర్స్ వస్తున్నాయట. వాటి వలన ప్రయోజనం ఉండదు. కెరీర్ కి ప్లస్ కావని శ్రీముఖి ఒప్పుకోవడం లేదట. ఆల్రెడీ క్రేజీ అంకుల్స్ మూవీలో శ్రీముఖి హీరోయిన్ గా నటించారు. ఆ సినిమా ఆడలేదు. దాంతో ఆమెకు ఫేమ్ రాలేదు. అందుకే కనీస గుర్తింపు ఉన్న దర్శకులు, హీరోలతో పని చేయాలని ఎదురుచూస్తున్నారట.

చిరంజీవి అప్ కమింగ్ మూవీ భోళా శంకర్ లో శ్రీముఖి కీలక రోల్ చేస్తున్నట్లు సమాచారం. చిరంజీవితో ఆమె రొమాంటిక్ సన్నివేశాలు ఉన్నాయట. ఈ చిత్రంతో శ్రీముఖికి బ్రేక్ వచ్చే సూచనలు కలవు. మరోవైపు శ్రీముఖి పెళ్లి రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. ఆ మధ్య హైదరాబాద్ కి చెందిన వ్యాపారవేత్తను వివాహం చేసుకోబోతోంది అంటూ ప్రచారం జరిగింది. ఈ వార్తలను శ్రీముఖి ఖండించారు. అప్పుడే పెళ్లి ఆలోచన లేదని తేల్చేశారు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker