Health

ఈ కాయలు మీరు తరచూ తింటే జీవితంలో హాస్పిటల్ వెళ్ళే అవసరం రాదు.

స్టార్ ఫ్రూట్ పండ్లు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో విరివిగానే దొరుకుతున్నాయి. నక్షత్ర ఆకారంలో కనిపించే ఈ పండు రసభరితంగా తినడానికి రుచిగా బాగుంటుంది. అందుకే దీన్నినేరుగా తింటుంటారు . ద్రాక్ష లాగానే మెరుపుదనంతో నిండి ఉంటాయి. బాగా పండిన పండ్లు పసుపురంగులోకి మారి తియ్యగా ఉంటాయి.

పచ్చి పండ్లు పుల్లగా ఉంటాయి. అయితే అయితే ఈ ఫ్రూట్ ని మీరు డైట్ లో చేర్చుకోండి ఈ ఫ్రూట్ పసుపు రంగులోకి మారితే తియ్యగా ఉంటుంది. పచ్చి పండ్లు అయితే పచ్చ రంగులో పుల్లగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వలన చక్కటి ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు రోగనిరోధక శక్తి మొదలు ఇతర లాభాలను కూడా ఈ ఫ్రూట్ వల్ల పొందొచ్చు. స్టార్ ఫ్రూట్లో పోషక పదార్థాలు ఎక్కువగా ఉంటాయి.

విటమిన్ సి, b2, b6, b9, ఫైబర్, పొటాషియం, జింక్, ఐరన్, క్యాల్షియం, సోడియం, కాపర్. మెగ్నీషియం మొదలైన పోషకాలు ఎక్కువగా ఉంటాయి స్టార్ ఫ్రూట్ ని డైట్ లో చేర్చుకుంటే చక్కటి ప్రయోజనాలని పొందొచ్చు కొలెస్ట్రాల్ని కరిగించడానికి స్టార్ ఫ్రూట్ బాగా ఉపయోగపడుతుంది. చెడు కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది రక్తం నుండి కొవ్వు అణువులను తొలగిస్తుంది స్టార్ ఫ్రూట్.

అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడే వాళ్ళు స్టార్ ఫ్రూట్ ని తీసుకుంటే ఆరోగ్యము ఎంతో బాగుంటుంది క్యాలరీలు, కొవ్వు పదార్థాలు ఇందులో అధికంగా ఉంటాయి. ఫైబర్ కూడా బాగా ఎక్కువ ఉంటుంది. బరువు తగ్గాలనుకునే వాళ్ళు స్టార్ ఫ్రూట్ ని తీసుకుంటే మంచిదని ఆరోగ్య నిపుణులు చెప్పారు జీవక్రియని వేగవంతం చేస్తుంది కూడా. గుండె ఆరోగ్యానికి కూడా స్టార్ ఫ్రూట్ బాగా మేలు చేస్తుంది స్టార్ ప్రూఫ్ లో రక్తపోటుని నియంత్రించే గుణాలు ఉంటాయి.

గుండె జబ్బులు రాకుండా స్టార్ ఫ్రూట్ చేస్తుంది. జీర్ణ క్రియకి కూడా ఇది ఎంతో బాగా ఉపయోగపడుతుంది. రోగనిరోధక శక్తిని కూడా స్టార్ ఫ్రూట్ తో పెంచుకోవచ్చు కిడ్నీ సమస్యలతో బాధపడే వాళ్ళు మాత్రం స్టార్ ఫ్రూట్ ని తీసుకోకూడదు కిడ్నీ రాళ్లు ఏర్పడే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker