News

ఆ స్టార్ హీరోతో క్లోజ్ గా హీరోయిన్, దీంతో స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన భార్య.

కన్నడ స్టార్ హీరో దర్శన్ హీరోయిన్ తో ఎఫైర్ విషయంతో వార్తల్లోకి ఎక్కారు. ఇందులో నిజమెంతో తెలియదు గానీ ఆయన భార్య మాత్రం ఆ హీరోయిన్ పై మండిపడ్డారట. హీరోయిన్ పవిత్ర గౌడ దర్శన్ తో ఎఫైర్ పెట్టుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే దీనికి మరింత ఊతమిచ్చేలా పవిత్ర గౌడ ఇటీవల తాను దర్శన్ తో క్లోజ్ గా దిగిన ఫొటోలను ఓ వీడియోగా రూపొందించి ఇన్ స్టాలో పోస్టు చేశారు.

అయితే కన్నడలో స్టార్ హీరో దర్శన్. ఇతడిని అభిమానులు ముద్దుగా డి-బాస్ అని పిలుస్తుంటారు. ఎప్పుడూ ఏదో ఓ అనవసరమైన కామెంట్స్ చేస్తూ వివాదాల్లో ఉంటాడు. అలాంటిది ఇప్పుడు ఇతడి సంసారంలో చిచ్చు రేగినట్లు తెలుస్తోంది. ఇదంతా కూడా పవిత్ర గౌడ అనే హీరోయిన్.. ఇన్ స్టాలో ఓ వీడియో పోస్ట్ చేయడంతో వచ్చింది. ’10 ఏళ‍్ల రిలేషన్‌షిప్ ఇది. ఎప్పటికీ ఇలానే ఉండిపోవాలని కోరుకుంటున్నాను.

థ్యాంక‍్యూ దర్శన్’ అని వీడియో దిగువన క్యాప్షన్ పెట్టింది. అయితే చాన్నాళ్ల నుంచి దర్శన్-పవిత్ర గౌడ మధ్య ఏదో ఉందని కన్నడ ఇండస్ట్రీలో రూమర్స్ వస్తూనే ఉన్నాయి. కానీ వాటిని పెద్దగా పట్టించుకోలేదు. కాకపోతే తాజాగా పోస్ట్ చేసిన వీడియోలో హీరో దర్శన్‌తో పవిత్ర గౌడ.. సన్నిహితంగా ఉన్న ఫొటోలు కూడా కొన్ని ఉన్నాయి. వీటిని చూసి నెటిజన్స్ అవాక్కయ్యారు. ఇక దర్శన్ భార్య విజయలక్ష్మి మరింత సీరియస్ అయిందట.

ఏకంగా సెట్‌కి వెళ్లి మరీ పవిత్ర గౌడకు వార్నింగ్ ఇచ్చిందట. ఇకపై దర్శన్‌తో కనిపించొద్దని పవిత్ర గౌడకు గట్టిగానే విజయలక్ష్మి చెప్పిందట. ప్రస్తుతం ఈ విషయం కన్నడ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారిపోయింది. ఈ విషయం మీద అవసరమైతే లీగల్ యాక్షన్ కూడా తీసుకుంటానని పవిత్రని దర్శన్ భార్య హెచ్చరించిందట. ఇందులో నిజానిజాలు ఏంటనేది తెలియాల్సి ఉంది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker