Health

మీరు ఉదయాన్నే ఈ పనులు చేస్తే, ఇంట్లో కూర్చునే పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు కరిగించేయొచ్చు.

రోజూ వ్యాయామం చేయడం వల్ల పొట్ట దగ్గర కొవ్వుతో సహా శరీరంలో ఉండే అదనపు కొవ్వు మొత్తం కరిగిపోతుంది. మంచి ఫలితం పొందాలంటే రోజూ కనీసం 30 నిమిషాల చొప్పున, వారానికి కనీసం 5 రోజులపాటు వ్యాయామం చేయాలి. చెమట పట్టేలా కసరత్తు చేసి హృదయ స్పందన రేటును పెంచాలి. దీనివల్ల కూడా పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు కరిగిపోతుంది. అయితే శరీరంలో వివిధ భాగాల్లో కొవ్వు పేరుకుపోవడం కన్నా పొట్టచుట్టూ కొవ్వుండటం కాస్త ప్రమాదమే. దానివల్ల గుండెపోటు, డయాబెటిస్, లివర్ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. మన అవయవాలు చుట్టూ ఉండే కొద్దిపాటి కొవ్వు రోజూవారీ శరీర పనితీరుకు సాయపడుతుంది.

కానీ అది మరీ ఎక్కువగా ఉంటే ప్రమాదమే. అయితే హైడ్రేషన్..ఉదయం నిద్ర లేవగానే ఒక పెద్ద గ్లాసు నిండా నీళ్లు తాగాలి. దాంట్లో కాస్త నిమ్మరసం కూడా పిండుకుని తాగడం వల్ల జీవక్రియ వేగం పెరుగుతుంది. ఈ తాజా పానీయం కొత్త ఉత్సాహాన్ని ఇవ్వడంతో పాటూ ఆహారం జీర్ణం అవడానికి సాయపడుతుంది. శరీరంలోని మళినాలను బయటకు పంపించే డిటాక్సిఫయర్ లాగా పనిచేస్తుంది. దానివల్ల బరువు తగ్గడంలో సాయపడుతుంది. వ్యాయామాలు..వేరే సమయం కన్నా ఉదయాన్నే వ్యాయామం చేయడం వల్ల పొట్ట చుట్టూ కొవ్వు కరుగుతుంది. వేగంగా నడవడం, యోగా చేయడం.. ఏదైనా చేయొచ్చు.

ఉదయాన్నే శరీరం కదిలించడం వల్ల జీవక్రియ పెరుగుతుంది. కొవ్వు ఆక్సీకరణం చెందుతుంది. ఉదయాన్నే కనీసం అరగంట సేపు వ్యాయామం చేయడం అలవాటు చేసుకోవడం ఉత్తమం. ప్రొటీన్ ఉన్న అల్పాహారం..ప్రొటీన్ ఎక్కువగా ఉన్న అల్పాహారం తీసుకోవడం వల్ల శరీరంలో చక్కెర స్థాయుల మీద ప్రభావం ఉంటుంది. జీవక్రియ వేగవంతం అవుతుంది. ఉదయాన్నే గుడ్లు, యోగర్ట్, ప్రొటీన్ స్మూతీ లాంటివి తినాలి. ప్రొటీన్లు అరగడానికి ఎక్కువ శక్తి అవసరం. దానివల్ల ఎక్కువ కేలరీలు ఖర్చవుతాయి.

అలాగే రోజు మొత్తం ఏదైనా తినాలనే కోరికనూ తగ్గిస్తాయి. ఆహార నియంత్రణ.. ఎంత తింటున్నాం, ఏం తింటున్నామనే విషయంల స్పష్టత ఉండాలి. ప్రతి ముద్దను ఆస్వాదిస్తూ మెల్లగా నములుతూ తినడం వల్ల ఆహారం మీద శ్రద్ధ పెరుగుతుంది. శరీరం ఆకలిని అర్థం చేసుకుంటాం. అవసరమైనంతే తినడం వల్ల పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు కాస్త తగ్గించుకోవచ్చు. ఫోన్ మాట్లాడుతూ, టీవీ చూస్తూ తింటే ఎంత తింటున్నామో కూడా తెలీదని గమనించండి. ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారం..ఉదయం ఆహారంలో పీచు ఎక్కువగా ఉండే ఆహారం చేర్చుకోవడం వల్ల బరువు తగ్గొచ్చు.

పండ్లు, కూరగాయలు, ధాన్యాలు, చిక్కుళ్లలో పీచు పుష్కలంగా ఉంటుంది. ఒత్తిడి నియంత్రణలో ఉంచుకోవాలి..దీర్ఘకాలిక ఒత్తిడి బరువు పెరిగేలా చేస్తుంది. దీని ప్రభావం పొట్ట చుట్టూ కొవ్వు మీదే ఎక్కువగా ఉంటుంది. అందుకే రోజూ ధ్యానం చేయడం వల్ల ఒత్తిడి తగ్గించుకోండి. దీని ప్రభావం శరీరం మీద చాలా ఉంటుంది. నిద్ర..బరువు నియంత్రణలో నిద్ర పాత్ర కీలకం. నిద్ర లేమి వల్ల హార్మోన్ల స్థాయుల్లో హెచ్చుతగ్గులొస్తాయి. ఆకలి పెరుగుతుంది. కొవ్వు ఎక్కువగా చేరుతుంది. రోజుకు కనీసం 7 నుంచి 9 గంటల నిద్రపోయేలా చూసుకోవాలి.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker