షుగర్ వ్యాధి వచ్చే నెల ముందు కనిపించే లక్షణాలు ఇవే. అప్పుడే మేల్కుంటే..?

ఇన్సులిన్ అనేది మన శరీరంలోని క్లోమ గ్రంధి ఉత్పత్తి చేసే హార్మోన్. క్లోమ గ్రంధి ఇన్సులిన్‌ను రక్తప్రవాహంలోకి విడుదల చేస్తుంది. ఇలా రక్తంలో ప్రవహించే ఇన్సులిన్, శరీర కణాలలోకి చక్కెర ప్రవేశించేలా చేస్తుంది. దీనిద్వారా శరీరానికి శక్తి అందుతుంది. అంటే ఈ ప్రక్రియలో ఇన్సులిన్ వ్యక్తుల రక్తప్రవాహంలో చక్కెర మొత్తాన్ని తగ్గిస్తుంది.
మీ రక్తంలో చక్కెర స్థాయి తగ్గిపోతే, క్లోమ గ్రంధి నుంచి ఇన్సులిన్ స్రావం కూడా తగ్గుతుంది. అయితే అంతేకాకుండా తరచుగా ఇలాంటి లక్షణాల బారిన పడేవారు మధుమేహం పరీక్ష చేయించుకోవడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాకుండా ఈ క్రింది వాటిపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది.
శరీరంలోని చక్కెర పరిమాణాలు కొంతమందిలో ఉదయాన్నే పెరిగే అవకాశాలున్నాయి. కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా చాలామందిలో ఈ క్రింది లక్షణాలు ఉంటే వైద్యులను సంప్రదించాల్సి ఉంటుంది.
ఇలాంటి లక్షణాలు ఉంటే జాగ్రత్తలు తప్పనిసరి..నోరు పొడిబారడం, ఎండిపోయిన గొంతు, మూత్రవిసర్జన, మబ్బు, బలహీనమైన అనుభూతి, ఆకలి పెరగడం, పొడి బారిన చర్మం, నెమ్మదిగా గాయం నయం, దాహం, జుట్టు ఊడుట, తరచుగా అంటువ్యాధులు, వాంతులు, తల తిరగడం, కడుపు నొప్పి. మధుమేహం బారిన పడిన వారిలో శరీరం బలహీనంగా మారుతుంది.
అంతేకాకుండా చర్మంపై తరచుగా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కూడా వస్తాయి. కొందరిలో చర్మం డిహైడ్రేషన్కు కూడా గురవ్వవచ్చు. ఇలాంటి లక్షణాలు తరచుగా పెరిగితే తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.