శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం వద్దు, చివరికి జీర్ణవ్యవస్థ మొత్తం కూడా..?

జీర్ణవ్యవస్థ అనగా ఆహారాన్ని జీర్ణం చేసే శరీర భాగం. ఇది ఆహారాన్ని సాధారణ రసాయన పదార్ధాలుగా విచ్ఛిన్నం చేస్తుంది, తద్వారా రసాయన పదార్థాలలోని కొన్ని పోషకాలు రక్త ప్రవాహంలో కలిసిపోతాయి. రక్త ప్రవాహం నుండి పోషకాలు మొదట కాలేయానికి చేరతాయి. కాలేయం పోషకాలను సర్దుబాటు చేస్తుంది, తద్వారా శరీరానికి అవసరమైన శక్తి లభిస్తుంది. అయితే అందుకే మనం ఆరోగ్యంగా ఉండాలంటే జీర్ణ వ్యవస్థ కూడా బాగుండాలి.
శరీరంలో జరిగే వివిధ రకాల మార్పులు వివిద రూపాల్లో బయపడినట్టే జీర్ణ వ్యవస్థలో సమస్యలుంటే కొన్ని లక్షణాల ద్వారా గుర్తించవచ్చు. జీర్ణ వ్యవస్థలో లోపముంటే ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. ఆ వివరాలు మీ కోసం.. మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే జీర్ణవ్యవస్థ సక్రమంగా ఉండి తీరాలి. లేకపోతే చాలా రకాల వ్యాధులు, సమస్యలు ఎదుర్కోవల్సి వస్తుంది.
జీర్ణవ్యవస్థ బలహీనంగా ఉంటే శరీరంలో అతి ముఖ్యమైన మెటబోలిజం కూడా మందగిస్తుంది. ఫలితంగా రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. అందుకే జీర్ణక్రియ బలహీనమైనప్పుడు లేదా సరిగ్గా లేనప్పుడు వివిధ రకాల సమస్యలు ఎదుర్కోవల్సి వస్తుంది. జీర్ణవ్యవస్థ సరిగ్గా లేనప్పుడు ఎలాంటి లక్షణాలు కన్పిస్తాయో తెలుసుకుందాం.. జీర్ణక్రియ సరిగ్గా లేనప్పుడు ఆ ప్రభావం శరీరంలోని వివిధ బాగాలపై కన్పిస్తుంది.
అదే విధంగా కేశాలపై పడుతుంది. కడుపులో సమస్య ఉంటే చర్మంతో పాటు కేశాలపై కూడా దుష్ప్రభావం పడుతుంది. జీర్ణక్రియ సరిగ్గా లేనందున తినే ఆహారం జీర్ణం కాదు. దాంతో కావల్సిన పోషకాలు అందక జుట్టు రాలడం ప్రారంభమౌతుంది. జీర్ణ సంబంధిత సమస్యలు దీర్ఘకాలం కొనసాగితే చర్మ సమస్యలు వెంటాడుతాయి. కడుపు శుభ్రంగా లేకపోతే పింపుల్స్, ఆయిలీ స్కిన్ సమస్య పెరిగిపోతుంది.
అందుకే శరీరాన్ని ఎప్పుడూ హైడ్రేట్‌గా ఉంచాలి. జీర్ణక్రియలో సమస్య ఉంటే తగినంత నీళ్లు తాగుతుండాలి. జీర్ణక్రియ బలహీనమైనప్పుడు నిద్ర సమస్య తలెత్తుతుంది. నిద్ర సరిగ్గా పట్టదు. ఎందుకంటే తినే ఆహారం జీర్ణం కాకపోవడంతో కడుపు బరువుగా ఉంటుంది. అదే సమయంలో తలనొప్పి సమస్య కూడా వెంటాడుతుంది.