Health

ఎండాకాలంలో ప్రతిరోజూ మజ్జిగ తాగితే ఎంత మంచిదో తెలుసుకోండి.

భారతదేశంలోని అనేక రాష్ట్రాల్లో సాధారణ భోజనంతో పాటు ఒక గ్లాసు మజ్జిగను అందిస్తుంటారు. ఇది ఎన్నో ఏళ్ల నుంచి కొనసాగుతూ వస్తోంది. సాధారణంగా, వేసవి కాలంలో మజ్జిగ వినియోగం పెరుగుతుంది, ఎందుకంటే ఇది వేడి నుండి చాలా అవసరమైన ఉపశమనం కలిగిస్తుంది. మజ్జిగను మన భోజనంలో కలపడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి .అందుకే ఇది సాంప్రదాయకంగా మన ఆహార సంస్కృతిలో భాగం. ఎండాకాలం వచ్చేసింది. ఎండలు బాగా ముదిరాయి.

బయటకు వెళ్లాలంటేనే జంకుతున్నారు. ఎండ ధాటకి అబ్బో అంటున్నారు. పది అయిందంటే ఎవరు బయటకు రావడం లేదు. భానుడు భగభగ మండుతున్నాడు. ఈ నేపథ్యంలో దాహం విపరీతంగా వేస్తుంది. నోరు ఎండిపోతుంది. దాహం తీర్చుకోవడానికి రకరకాల మార్గాలు అన్వేషిస్తాం. చల్లని నీరు తాగితే ఉపశమనం లభిస్తుందని ఆశిస్తుంటారు. ఫ్రిజ్ వాటర్ కంటే కుండలోని నీరే సురక్షితం. ఫ్రిజ్ వాటర్ తాగితే లేనిపోని ఇబ్బందులు రావడం ఖాయం.

ఇంకా ఎండాకాలంలో మజ్జిగ తాగితే ఎంతో ప్రయోజనకరం. మజ్జిగ తాగితే శరీరం చల్లబడుతుంది. మజ్జిగలో ఉన్న మ్యాజిక్ అదే. మనకు చల్లదనం అందించే గుణాలు అందులో ఉంటాయి. వేసవి కాలంలో ఓ గ్లాసు మజ్జిగ తాగడం వల్ల ఒంట్లోని వేడి తగ్గిపోతుంది. మజ్జిగలో కాస్త ఉప్పు వేసుకుని తాగుతారు. ఇంకా కావాలంటే అందులో కరివేపాకు, కొత్తిమీర, జీలకర్ర, మిరియాలు, పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. ఇలా చేసుకుని తాగితే ఎన్నో ప్రయోజనాలు దక్కుతాయి.

మజ్జిగలో నిమ్మరసం కూడా కలుపుకుని తాగుతారు. దీని వల్ల కూడా మంచి లాభాలు ఉన్నాయి. ఇలా మజ్జిగ ఎండాకాలంలో తాగడం వల్ల శరీరం డీ హైడ్రేషన్ కాకుండా తోడ్పడుతుంది. ఎండ బారి నుంచి రక్షిస్తుంది. కాఫీ, టీలకు బదులు మజ్జిగ తాగితే ఎంతో ఉత్తమం. కానీ మజ్జిగ గురించి ఎవరు పెద్దగా పట్టించుకోరు. ఆరోగ్యాభిలాషులు మాత్రమే మజ్జిగ తీసుకునేందుకు ఇష్టపడతారు. మజ్జిగ తాగితే చాలా లాభాలున్నాయి. వేసవి కాలంలో వేడికి మంచి ఉపశమనం ఇచ్చేది మజ్జిగే.

కానీ అందరు కూల్ డ్రింకులు తాగేందుకు మొగ్గు చూపుతారు. ఫలితంగా రోగాల బారిన పడుతున్నారు. అయినా లెక్క చేయడం లేదు. గ్లాసు మజ్జిగలో ఎన్నో ప్రొటీన్లు దాగి ఉన్నాయి. దీంతో మన ఆరోగ్యం బాగుంటుంది. చల్లదనాన్ని ఇవ్వడంలో మజ్జిగ ఎంతో ఉపయోగపడుతుంది. ఇలా మజ్జిగను తాగుతూ ఎండల బారి నుంచి కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker