రోజు తలస్నానం చేస్తే జుట్టు తొందరగా ఊడిపోతుందా..? అసలు విషయం ఏంటంటే..?

తలస్నానం..జుట్టు తడిగా ఉన్నప్పుడు వెంట్రుకలు బలహీనంగా ఉంటాయి. కాబట్టి, జాగ్రత్తగా ఉండాలి. తల స్నానం తర్వాత చిక్కులు పడిన వెంట్రుకలకు కొబ్బరినూనె పట్టించాలి. ఆ తర్వాతే వెడల్పాటి పండ్లు ఉన్న దువ్వెనతో చిక్కులు తీసుకోవాలి. అలా అని తల పూర్తిగా ఆరిపోయే వరకు దువ్వుకోకుండా ఉండకూడదు. ఇలా చేయడం వల్ల వెంట్రుకలు మెరుపును కోల్పోతాయి. తలస్నానం కారణంగా కుదుళ్లు బలహీనంగా మారతాయి. సున్నితంగా రుద్దినా జుట్టు ఊడిపోయే ఆస్కారం ఉంది.
ఇక టవల్‌తో మరీ గట్టిగా తుడుచుకుంటున్నామంటే, చాలా నష్టం కలిగిస్తున్నట్లే. దీనికి బదులుగా టవల్‌తో మాడును నెమ్మదిగా నీళ్లు ఇంకిపోయేలా ఒత్తుకోవాలి. అంతేకాదు, తలస్నానం తర్వాత తలకు టవల్ చుట్టు కోకూడదు. ఇలా చేస్తే చుండ్రు చేరే ప్రమాదం ఉంది. అయితే మనలో చాలా మంది జుట్టు ఊడిపోయే సమస్యతో బాధపడుతున్నారు. ఇటీవల కాలంలో బట్టతల సాధారణంగానే వస్తుంది. పూర్వం రోజుల్లో ముసలితనంలో వచ్చే బట్టతల ఇప్పుడు చిన్న వయసులోనే పలకరిస్తోంది.

దీంతో యువత అవమానానికి గురవుతున్నారు. నలుగురిలో తిరగాలంటే సిగ్గుపడుతున్నారు. కానీ ఏం లాభం? మన ఆహార అలవాట్లే మనకు బట్టతల వచ్చేందుకు కారణమవుతోంది. ఈనేపథ్యంలో బట్టతల రావడానికి పలు కారణాలు ఉంటున్నాయి. రోజు తలస్నానం చేస్తే..సాధారణంగా మగవారు రోజు తలస్నానం చేస్తారు. రోజు తలస్నానం చేస్తే బట్టతల వస్తుందనేది అపోహ మాత్రమే. రోజు తల స్నానం చేయడం వల్ల ఎలాంటి ఇబ్బందులు రావు. ముమ్మాటికి తలస్నానం చేయడం వల్ల జుట్టు ఊడిపోతుందనేది అనుమానమే.
దీంతో మనం రోజు తలస్నానం చేసుకుని ఆరోగ్యంగా ఉండొచ్చు. బట్టతల వస్తుందనే భయం అవసరం లేదు. జాగ్రత్తలు తీసుకోవాలి. తలస్నానం చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. గాఢత కలిగిన షాంపూలు కాకుండా సున్నితమైన షాంపూలను వాడుకోవడం మంచిది. ఇంకా కుంకుడు కాయలైతే ఇంకా బెటర్. పూర్వం రోజుల్లో షాంపూలు లేనప్పుడు కుంకుడు కాయలతోనే తల స్నానం చేసేవారు. ఇంకా వెంట్రుకలకు ఆముదం రాసుకునే వారు. దీంతో జుట్టు బలంగా ఉండేది. ఎలాంటి సమస్యలు వచ్చేవి కావు.

రానురాను రాజుగారి గుర్రం గాడిదయిందన్నట్లు షాంపూలు వచ్చాక జుట్టు రాలడం సమస్య మొదలైంది. హెయిర్ కండీషన్..రోజు తలస్నానం చేశాక హెయిర్ కండీషనర్ ఉపయోగించాలి. జుట్టు రాలే సమస్య లేకుండా ఉండాలంటే మనం కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. ప్రతి వ్యక్తికి రోజు 50 నుంచి 100 వెంట్రుకలు ఊడిపోతుంటాయి. ఊడిపోయిన చోట కొత్త వెంట్రుకలు మొలవడం సహజం. దీంతో బట్టతల సమస్య రాకుండా ఉంటుంది. ఒకవేళ జుట్టు ఎక్కువగా రాలుతుంటే వైద్యుడిని సంప్రదించి చికిత్స తీసుకోవడం మంచిది.