News

వాళ్ళు నా జీవితంలోకి వస్తుంటారు, వెళుతుంటారు, అసలు విషయం చెప్పిన సురేఖ వాణి కూతురు.

క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఏ పాత్రలోనైనా అలవోకగా ఒదిగిపోయే నటి సురేఖా వాణి. ఎన్నో సినిమాల్లో వదినగా, తల్లిగా, అక్క పాత్రలలో నటించి ప్రేక్షకులకు దగ్గరైంది సురేఖా. ఇదిలా ఉంటే.. సురేఖా వాణి, ఆమె కూతురు సుప్రితకు సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎప్పటి కపుడు తాజా ఫోటో షూట్స్‌తో అభిమానులను అలరిస్తూనే ఉంది.

అయితే కొన్ని సార్లు తమ పోస్ట్ వల్ల సురేఖ వాణి, సుప్రీత ట్రోలింగ్ ట్రోలింగ్ కి గురవుతుంటారు. అయితే మితిమీరిన కామెంట్స్ కి మాత్రం సురేఖ వాణి, సుప్రీత కౌంటర్ ఇవ్వడం చూశాం. తాజాగా సురేఖ వాణి కుమార్తె సుప్రీత సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అందుకు కారణం సుప్రీతా నర్మగర్భంగా చేసిన పోస్ట్. తన ఫోటోలు షేర్ చేస్తూ సుప్రీతా కామెంట్ పెట్టింది.

నా జీవితంలోకి కొందరు వస్తుంటారు వెళుతుంటారు.. అదే లైఫ్ అంటే అంటూ కాస్త ఎమోషనల్ గా పోస్ట్ పెట్టింది. కానీ ఆమె షేర్ చేసిన ఫోటోస్ మాత్రం చాలా గ్లామరస్ గా ఉన్నాయి. ఈ పోస్ట్ కి సుప్రీతా కామెంట్స్ కూడా ఆపేసింది. దీనితో సుప్రీతా ఎం చెబుతోందో అర్థం కాక నెటిజన్లు తికమక పడుతున్నారు. బహుశా సుప్రీతా ప్రేమ వ్యవహారం గురించి ఇలా పరోక్షంగా మాట్లాడుతోందా అనేది కూడా చర్చగా మారింది.

ప్రస్తుతం సుప్రీతా.. బిగ్ బాస్ అమర్ దీప్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. అందుకే సోషల్ మీడియాలో తరచుగా గ్లామర్ పిక్స్ షేర్ చేస్తోంది. గతంలో సుప్రీతా మ్యూజిక్ వీడియోలు కూడా చేసింది. ఇప్పుడు తన తల్లి అండదండలతో హీరోయిన్ గా ఎదగాలని ప్రయత్నిస్తోంది. మరి సుప్రీతా హీరోయిన్ గా సక్సెస్ అవుతుందేమో చూడాలి.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker