News

దమ్ముంటే వాళ్లలా చేసి చూపించు, వాళ్లు నీలా దిగజారిపోలేదు, రోజాపై కిరాక్ ఆర్పీ సంచలన వ్యాఖ్యలు.

జనసేన సపోర్టర్స్‌ను రోజా విమర్శిస్తున్నారని, దానిపై తన స్పందన ఏంటి అని ఆర్పీని అడగగా.. ‘‘మమ్మల్ని గౌరవిస్తే రోజా గారు అంటాం. గౌరవించకపోతే రోజా అంటాం. రోజా ఏం మాట్లాడింది.. ఆది, నేను, ఇలా కొందరు వెళ్లి పార్టీకి సపోర్ట్ చేస్తున్నాం అన్నది. మేమంతా చిన్న చిన్న ఆర్టిస్టులం అంటా. ఆమె ఏమైనా నేషనల్ అవార్డ్ ఆర్టిస్టా? ఆ యువరాణి ఏమైనా 10 నేషనల్ అవార్డులు, 10 ఆస్కార్ అవార్డులు కొట్టిందా? వాళ్లు స్వచ్ఛందంగా చేసుకుంటున్నారు. వారికి పవన్ కళ్యాణ్‌పై లేదా టీడీపీ అంటే ఇష్టం ఉంది.

మీరు చేసే అవినీతిపై వ్యతిరేకత ఉంది. చిన్న చిన్న ఆర్టిస్టుల అంటున్నావు కదా.. నీకు దమ్ముంటే గెటప్ శ్రీను చేసే ఒక్క క్యారెక్టర్ అయినా నీ జీవితంలో చేయగలవా?’’ అంటూ ‘జబర్దస్త్’ ఆర్టిస్టులతో రోజాను పోలుస్తూ వ్యాఖ్యలు చేశాడు ఆర్పీ. అయితే వైసీపీ నుంచి నటి రోజా నగిరి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. పిఠాపురంలో సుడిగాలి సుధీర్, హైపర్ ఆది, గెటప్ శ్రీను, ఇతర జబర్దస్త్ ఆర్టిస్టులు ప్రచారం చేస్తుండడంతో రోజా స్పందించింది. వాళ్లంతా చిన్న ప్రాణాలు.

మెగా ఫ్యామిలీకి భయపడి ప్రచారం చేస్తుంటారు అని అర్థం వచ్చేలా రోజా కామెంట్స్ చేశారు. దీనితో కిరాక్ ఆర్పీ రోజాపై విరుచుకుపడుతూ మీడియా ముందు సంచలన వ్యాఖ్యలు చేశాడు,. రోజా గారు మాకు మర్యాద ఇస్తే మేము కూడా ఆమెకి మర్యాద ఇస్తూ మాట్లాడతాం. మమ్మల్ని చిన్న చిన్న ప్రాణాలు, చిన్న చిన్న ఆర్టిస్టులు అని సంబోధించింది. ఈవిడ ఏమన్నా నేషనల్ ఆర్టిస్టా.. 20 ఆస్కార్లు గెలిచిందా అంటూ కిరాక్ ఆర్పీ సెటైర్లు వేశాడు.

అంతటితో ఆగలేదు. సుధీర్, గెటప్ శ్రీను, హైపర్ ఆది, ఇతర ఆర్టిస్టులు స్వచ్చందంగా పవన్ కళ్యాణ్ గారిపై ఇష్టంతో ప్రచారం చేస్తున్నారు. చిన్న చిన్న ఆర్టిస్టులు అనే చులనక భావం ఏంటి అని కిరాక్ ఆర్పీ ప్రశ్నించాడు. నీ జీవితంలో ఎప్పుడైనా గెటప్ శ్రీను లాగా యాక్టింగ్ తో మెప్పించావా ? సుధీర్ కింది స్థాయి నుంచి కష్టపడి ఎదిగి ఈరోజు హీరో అయ్యాడు. సుధీర్ కి ఉన్నంత క్రేజ్ అయినా ఉందా నీకు ? హైపర్ ఆది జబర్దస్త్ చరిత్రనే మార్చాడు.

ఒక ట్రెండ్ సెట్ చేశాడు. గంటసేపు ఏకధాటిగా కామెడీ చేస్తూ నవ్వించగలడు. హైపర్ ఆది తో నువ్వు పోటీ పడగలవా అంటూ అంటూ కిరాక్ ఆర్పీ రోజాపై విరుచుకుపడ్డాడు. రోజా గురించి మేమెప్పుడూ అగౌరవంగా మాట్లాడలేదు. కానీ ఆమె మాత్రం చిన్న చిన్న ప్రాణాలు అంటూ చులకన చేస్తోంది అని ఆర్పీ మండిపడ్డాడు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker