News

తల్లి ముందే ఆ హీరోతో రొమాన్స్ చేసిన సుప్రీత, దీంతో సురేఖావాణి ఏం చేసిందంటే..?

కెమెరా ముందుకు రాకముందే సోషల్ మీడియాలో సుప్రీత మంచి ఫాలోయింగ్ సంపాదించింది. తరచుగా హాట్ ఫోటో షూట్లు, డాన్సులు, రీల్స్ తో యూత్ ని ఎట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. రీసెంట్ గా ఓ ప్రైవేట్ సాంగ్ కూడా చేసింది. అయితే సీరియల్ నటుడు అమర్ దీప్ హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. ఇటీవల అధికారికంగా ఈ మూవీ ప్రకటించారు. పూజా కార్యక్రమం నిర్వహించారు. మీడియా సమావేశంలో చిత్ర యూనిట్ పాల్గొన్నారు. చిత్ర విశేషాలు పంచుకున్నారు. మహీంద్ర నాథ్ కొండ్ల నిర్మిస్తుండగా, దర్శకుడు మాల్యాద్రి రెడ్డి తెరకెక్కిస్తున్నారు.

ఈ చిత్రానికి టైటిల్ నిర్ణయించాల్సి ఉంది. రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోందని సమాచారం. బిగ్ బాస్ రన్నర్ అమర్ దీప్, సురేఖావాణి కూతురు సుప్రీత కలిసి నటించడంతో హైప్ ఏర్పడింది. కాగా ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్ళింది. ఈ విషయాన్ని సురేఖావాణి స్వయంగా తెలియజేసింది. మొదటి రోజు షూట్ విశేషాలు సుచాయిగా తన ఫ్యాన్స్ తో పంచుకుంది. మానిటర్ వద్ద కూర్చుని పర్యవేక్షించిన సురేఖావాణి కొన్ని ఫోటోలు తన ఇంస్టాగ్రామ్ స్టేటస్ లో పోస్ట్ చేసింది.

హీరో అమర్ దీప్ తో పాటు కూతురు సుప్రీతకు కంగ్రాట్స్, బెస్ట్ విషెష్ తెలియజేసింది. సురేఖావాణి పోస్ట్స్ వైరల్ అవుతున్నాయి. అమర్ దీప్, సుప్రీత కాంబినేషన్ లో కొన్ని రొమాంటిక్ సీన్స్ తెరకెక్కించారని ఆ ఫోటోలు చూస్తే అర్థం అవుతుంది. నటి సురేఖావాణి హీరోయిన్ తల్లి హోదాలో సెట్స్ లో సందడి చేసింది. సుప్రీతను హీరోయిన్ చేయాలి అనేది సురేఖావాణి కోరిక. అందుకే సోషల్ మీడియాలో ఆమెను పాప్యులర్ చేసింది. సుప్రీత-సురేఖావాణి కలిసి డాన్స్ వీడియోలు చేసేవారు.

అలాగే ఫోటో షూట్స్ లో పాల్గొనేవారు. ఆ విధంగా సురేఖావాణి తనతో పాటు కూతురిని కూడా జనాలకు పరిచయం చేసింది. మరోవైపు అమర్ దీప్ హీరోగా అదృష్టం పరీక్షించుకుంటున్నారు. గతంలో అమర్ దీప్ సీరియల్స్ చేశాడు. అలాగే వెబ్ సిరీస్లలో నటించాడు. బిగ్ బాస్ సీజన్ 7లో పాల్గొన్న అమర్ దీప్, తన అభిమాన హీరో రవితేజ మూవీలో కూడా నటించే ఛాన్స్ రాబట్టాడు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker