News

గుడ్‌న్యూస్ చెప్పిన కోహ్లీ, రెండో బిడ్డకు జన్మనిచ్చిన అనుష్క శర్మ, ఏం పేరు పెట్టారో తెలుసా..?

ఫిబ్రవరి 15న మగబిడ్డ పుట్టాడని విరుష్క జంట తెలిపింది. తమ కూతురు వామికకు తమ్ముడు పుట్టాడని పేర్కొంది. ‘అంబరాన్నంటే ఆనందంతో, మా హృదయం నిండా నిండిన ప్రేమతో తెలుపుతున్నాం. ఫిబ్రవరి 15న మా మగబిడ్డ, వామికా తమ్ముడు అకాయ్‌కి ఈ ప్రపంచంలోకి స్వాగతం పలికాం. మీ ఆశీస్సులు, శుభాకాంక్షలు కావాలి.

అలాగే, ఇటువంటి సమయంలో మా ప్రైవసీని మీరు గౌరవింవాలని కోరుతున్నాం’ అని విరుష్క జంట ప్రకటన చేసింది. విరుష్క జంట 2017లో పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. 2021లో అనుష్క, విరాట్‌కు వామికా పుట్టింది. అయితే “ఈ సంతోషకరమైన విషయన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను.

మీ అందరి ప్రేమాభిమానాలతో ఫిబ్రవరి 15న అనుష్క శర్మ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ‘అకాయ్’ వామిక లిటిల్ బ్రదర్ ఈ ప్రపంచంలోకి వచ్చాడు. వాడికి మీ అందరి ఆశీస్సులు, ప్రేమకావాలని కోరుకుంటున్నాను. ఈ సమయంలో నా ప్రైవసీని గౌరవించండి..థ్యాంక్యూ మీ విరాట్-అనుష్క” అంటూ రాసుకొచ్చాడు టీమిండియా రన్ మెషిన్ విరాట్ కోహ్లీ.

ఈ విషయం ఇంత ఆలస్యంగా కోహ్లీ ఎందుకుచెప్పాడా? అంటూ సందేహం వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్. ఈ విషయం తెలిసి పలువురు సెలబ్రిటీలు ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker