Health

టాటూ వేయించుకున్న వాళ్లు సంవత్సరం వరకు ఈ పనులు అస్సలు చేయకూడదు.

టాటూలు వేయించుకోవడమనేది ఈ జనరేషన్​లో ఫాష్యన్. రకరకాల టూటూలు వేయించుకుని సంబురపడిపోతుంటారు. తల్లిదండ్రులు గురించో.. ప్రేమించిన వారి గురించే.. లేదా వారి లైఫ్​కి తగిన కోట్స్ టాటూ రూపంలో వేయించుకుని ఆనందిస్తారు. అయితే ఈ టాటూలు వేయించుకునే సమయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే.. ప్రాణాలకే ప్రమాదం అనే విషయాన్ని మరోసారి రుజువు చేస్తుంది. అయితే రక్తదానం ప్రాణదానం అనే నానుడి ఉంది. ప్రాణపాయస్థితిలో లేదంటే ఆపరేషన్‌లు, ప్రమాదాలకు గురైన వాళ్లు బాగా రక్తాన్ని కోల్పవడం వల్ల వారికి రక్తం ఎక్కిస్తారు.

ఇందుకోసం కొందరు స్వచ్చందంగా రక్తదానం చేస్తుంటారు. అయితే గతంతో పోలిస్తే ప్రస్తుత కాలంలో రక్తదానాలు చేసే వారి సంఖ్య పెరిగింది. ప్రస్తుత కాలంలో రక్తదానం చేసే వాళ్లలో యువతి, యువకులే ఎక్కువగా ఉంటున్నారు. వారితో పాటు సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు అందరూ రక్తదాన శిభిరాలు ఏర్పాటు చేసి మరీ రక్తం ఇస్తున్నారు. అయితే ఇందులో ఓ విచిత్రమైన విషయం దాగి ఉంది. పచ్చబొట్టు(టాటూ)వేసుకున్న వారు రక్తదానం చేయడానికి వీలుండేది కాదు.

ఎందుకంటే టాటూ వేయించుకున్న వారి రక్తం ఎక్కించుకుంటే అంటువ్యాధులు వస్తాయని భావించి వారి దగ్గర రక్తం తీసుకునే వారు కాదు. కాని ప్రస్తుతం మాత్రం ఈ పద్దతి పూర్తిగా మారిపోయింది. రక్తదానం చేసే ప్రతి 100 మందిలో 90 మందికి టాటూస్ ఉంటున్నాయి. ఇప్పుడు మాత్రం భయపడకుండా రక్తం తీసుకోవడం జరుగుతుంది. అయితే కొంత మంది ప్రజల్లో మాత్రం దానిపై భయం అలాగే ఉంది. అయితే ఓవైపు టాటూ వేయించుకున్న వారి రక్తం తీసుకోకూడదనే ప్రచారంతో పాటు పర్వాలేదులే అని తీసుకుంటున్న వారు ఉన్నారు.

దీనిపై రెడ్ క్రాస్ వారు కొన్ని నియమాలను పెట్టడం జరిగింది. ఎవరైనా టాటూ వేయించుకుంటే సంవత్సరం పాటు అంటే 12 నెలలు రక్తదానం చేయకూడదు. ఇందులో కూడా ప్రభుత్వ నియత్రింత పచ్చబొట్ల కేంద్రంలో టాటూ వేయించుకోకపోతే మాత్రమే వర్తిస్తుంది. ఎందుకంటే హెపటైటిస్ వంటివి రాకుండా జాగ్రత్త కోసం ఈ విధంగా చేస్తారు. అదే ప్రభుత్వ నియత్రింత పచ్చబొట్ల కేంద్రంలో స్టెరైల్ పద్ధతిలో వేస్తే కచ్చితంగా రక్తం తీసుకుంటారు. చాలా రాష్ట్రాల్లో ఆ నియంత్రణ లేదు కాబట్టి దాదాపు అందరూ ఒక ఏడాది తరువాత రక్తదానం చేయడానికి అవకాశం కల్పించారు.

రాష్ట్రీయ ఎయిడ్స్ నియంత్రణ సంఘం వారి నియమాల ప్రకారం 6 నెలలు కనీసం ఆగితే మాత్రమే రక్తదానం చేసే అవకాశం ఉంది. కాని ప్రస్తుత సమాజంలో టాటూ(పచ్చబొట్టు) వేయించుకోవడం ట్రెండ్‌గా మారింది. అలాగే రక్తదానం చేయడం స్వచ్చంద సేవలో ప్రధాన భాగమైంది. కాబట్టి ఈ నియమ, నిబంధనలు పెద్దగా పట్టించుకోవడం లేదు. ఇదేవిధంగా శరీరంలో ఏదైనా చిన్నపాటి సర్జరీ జరిగినా 6 నెలల పాటు రక్తదానం చేయలేరు. ఆరోగ్య నిపుణుడి సహాయంతో టాటూలు వేయించుకుంటే ఎటువంటి ఇబ్బంది ఎదురుకాదు. జ్వరం, జలుబు మొదలైనవి ఉన్నప్పుడు కూడా రక్తదానం చేయకూడదని వైద్య నిపుణులు సూచిస్తుంటారు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker