Health

నడవటానికి చాలా కష్టంగా ఉన్నవారు కూడా ఈ మొక్కతో కొండల్ని సైతం ఈజీగా ఎక్కెస్తారు.

ఆర్థరైటిస్ సహా ఇతర అనేక రకాల కీళ్ల నొప్పుల నివారణకు అత్యంత ప్రసిద్ధమైన మూలికలలో నిర్గుండి ఒకటి. ఇందులోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ , యాంటీఆక్సిడెంట్ లక్షణాలు మంట, నొప్పిని తగ్గించడమే కాకుండా కీళ్లను వదులుగా చేసేందుకు అవకాశం ఇస్తాయి. అయితే నిర్గుండి మూలిక.. ఆయుర్వేదం ప్రకారం పిత్త, కఫ, వాత దోషాలు ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. వాత దోషం కదలికతో ముడిపడి ఉంటుంది. కీళ్లు, కండరాల్లో అసౌకర్యానికి దారితీస్తుంది. కీళ్లను రక్షించే కందెన(జెల్)ను తగ్గిస్తుంది.

దీంతో కదలికల సమయంలో నొప్పి ఉంటుంది. ఈ అసౌకర్యాలను పరిష్కరించడానికి ఆయుర్వేదంలో సరళమైన, సమర్థవంతమైన చికిత్స పద్ధతులు ఉన్నాయి. కీళ్ల ఆరోగ్యాన్ని పెంపొందించడంలో ‘నిర్గుండి’ అనే మూలిక సమర్థవంతంగా పనిచేస్తుంది. తెలుగులో దీన్ని వావిలి మొక్క లేదా సింధువార అంటారు. ఇందులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు కీళ్ల, కండరాల నొప్పిని తగ్గిస్తాయి. అశ్వగంధ, లవంగాలు సైతం కీళ్లు, కండరాల నొప్పుల సహజ నివారిణిగా పనిచేస్తాయి. వెల్లుల్లిలోని యాంటీ బాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు కీళ్ల నొప్పులను తగ్గించగలవు.

రెగ్యులర్‌గా వ్యాయామం, యోగా, ధ్యానం వంటివి ప్రాక్టీస్ చేస్తూ శరీరాన్ని ఉత్తేజపర్చుకోవడం కూడా ముఖ్యమే. షల్లకి సారం.. మారిన జీవనశైలి, పేలవ ఆహారపు అలవాట్లు కీళ్లు, కండరాల ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తున్నాయి. దీర్ఘకాలిక గాయాలు, లిగమెంట్ చీలిక, భంగిమ సరిగా లేకపోవడం, విటమిన్ డి లోపం వంటివి కీళ్లు, కండరాల నొప్పులకు సాధారణ కారణాలు. ఈ సమస్యలను పట్టించుకోకపోతే వాపు వంటి తీవ్ర సమస్యలకు దారితీసి, నొప్పి మరింత పెరిగే అవకాశం ఉంటుంది.

కొన్ని సందర్భాల్లో రోజువారీ పనులు చేసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కీళ్లు, కండరాల నొప్పులకు చెక్ పెట్టే అద్భుతమైన చికిత్స పద్ధతులు ఆయుర్వేదంలో ఉన్నాయి. అందులో ఒకటి శలాకి సారం. ఇది సహజమైన మూలిక. కీళ్ల నొప్పిని తగ్గిస్తుంది. రుమాటిజం, ఆర్థరైటిస్ నొప్పి నుంచి ఉపశమనం కల్పిస్తుంది. శలాకి సారాన్ని పురాతన కాలం నుంచి నొప్పుల నివారణకు చికిత్సగా ఉపయోగిస్తున్నారు. ఇది కండరాల అసౌకర్యాన్ని తగ్గిస్తుంది. దీని వినియోగంతో కీళ్లు దృఢంగా మారతాయి.

దీంతో మొత్తం ఆరోగ్యం మెరుగుపడుతుంది. ప్రముఖ ఆయుర్వేద నిపుణులు, ధరిషా ఆయుర్వేద వ్యవస్థాపకుడు రాజిందర్ ధమిజా; గుడుచి ఆయుర్వేద వైద్యశాలలో ప్రధాన వైద్యురాలు డాక్టర్ యమునా BS ఈ వివరాలను హిందుస్థాన్ టైమ్స్‌కు వెల్లడించారు. అయితే ఈ ఆయుర్వేద మూలికలను సొంతంగా వాడేముందు కీళ్లు, కండరాల నొప్పుల మూల కారణం తెలుసుకోవడానికి ఆయుర్వేద వైద్యుడిని సంప్రదించడం మంచిది. వారు సమస్యను విశ్లేషించి సరైన వైద్యం అందిస్తారు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker