Health

నాలుకపై ఈ లక్షణాలు కనిపిస్తే మీ ఆరోగ్యం ఎంత ప్రమాదంలో ఉందొ తెలుసుకోండి.

నాలుకను బట్టి మనిషి ఆరోగ్య పరిస్థితిని అంచనా వేయడమనేది డాక్టర్లకు చాలా సులువు. అయితే ఇప్పుడు నాలుకను చూసి మీ ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకోవచ్చు. నాలుక రంగులను బట్టి మీ ఆరోగ్య పరిస్థితిని అంచనా వేయవచ్చు. ఉదహారణకు మీ నాలుక గులాబీ రంగులో కనిపిస్తే అది తేమగా.. మృదువుగా ఉన్నట్లు అర్థం. అలాగే.. కాస్తా తేడాగా ఉన్నా.. ఒత్తిడి లేదా నొప్పి ఉంటే కోన్ని ఆరోగ్య సమస్యలను చూపిస్తుంది. అయితే రక్తనాళాలను గట్టిపడి రక్తపోటు పెరుగుతుంది. కాలేయంలో కొవ్వు పేరుకుపోయి కాలేయ వ్యాధి వస్తుంది. దీనిని వైద్యపరంగా హైపర్ కొలెస్టెరోలేమియా అంటారు.

30ల్లో ఉన్న మహిళలకు చెడు కొలెస్ట్రాల్ కారణంగా అనారోగ్యాల ముప్పు పెరుగుతోందని అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే ఈ సమస్యను నాలుకపై కనిపించే కొన్ని లక్షణాలతో గుర్తించవచ్చు. రక్తప్రవాహంలో కొలెస్ట్రాల్ స్థాయిలు పెరగడాన్ని హైపర్ కొలెస్టెరోలేమియా అంటారు. కొలెస్ట్రాల్ అనేది కణాల అభివృద్ధికి అవసరమైన పదార్థం, కానీ అధికంగా ఉంటే చనిపోయే రిస్క్ పెరుగుతుంది. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉందని ఛాతీ నొప్పి, శ్వాస ఆడకపోవడం వంటి లక్షణాలు తెలియజేస్తాయి. అయితే మహిళల్లో ఈ లక్షణాలు భిన్నంగా ఉండవచ్చు. స్త్రీల శరీరంలో చెడు LDL కొలెస్ట్రాల్ అధిక స్థాయిలో ఉందని నాలుకలో వచ్చే మార్పులు ఆధారంగా తెలుసుకోవచ్చు.

నాలుక ఉబ్బడం.. నాలుక సాధారణ పరిమాణం కంటే పెద్దదిగా కనిపిస్తే, హై కొలెస్ట్రాల్‌ను తెలిపే ఓ చిన్న సంకేతం. ఈ వాపు నాలుక రక్త నాళాలలో కొలెస్ట్రాల్ చేరడం వల్ల సంభవించవచ్చు. రుచి సరిగా తెలుసుకోకపోవడం..అధిక కొలెస్ట్రాల్ రుచిని ప్రభావితం చేస్తుంది, నోటిలో చేదు లేదా మెటల్ టేస్ట్ కలిగిస్తుంది. 30 ఏళ్లలోపు మహిళలు అలాంటి మార్పులను గమనిస్తే కొలెస్ట్రాల్ స్క్రీనింగ్‌ టెస్ట్‌ చేయించుకోవాలి. తెల్లని మచ్చలు లేదా పాచెస్..నాలుకపై అసాధారణమైన తెల్ల మచ్చలు లేదా పాచెస్ అధిక LDL కొలెస్ట్రాల్‌ను సూచిస్తాయి. ఈ లక్షణం ఓరల్ ల్యుకోప్లాకియా వల్ల కనిపిస్తుంది. ఇది కొలెస్ట్రాల్ ఇంబ్యాలెన్స్‌తో సంబంధం కలిగి ఉంటుంది.

నోరు పొడిబారడం (జిరోస్టోమియా).. డ్రై మౌత్ అధిక కొలెస్ట్రాల్‌కు హెచ్చరిక సంకేతం కావచ్చు. చర్మం కింద పేరుకుపోయిన కొలెస్ట్రాల్ ముద్దలు లాలాజల ఉత్పత్తికి అంతరాయం కలిగిస్తాయి. దీనివల్ల నోరు, నాలుక పొడిబారవచ్చు. మంట..నాలుకపై మండుతున్నట్లు అనిపిస్తే అది అధిక LDL కొలెస్ట్రాల్ లెవెల్స్‌ను సూచించవచ్చు. రక్త నాళాలలో కొలెస్ట్రాల్ పేరుకుపోవడం వల్ల నాలుక నరాలలో ఇన్‌ఫ్లమేషన్ కలుగుతుంది. దీనివల్ల అసౌకర్యం తలెత్తుతుంది. పూత లేదా వెంట్రుకలు.. నాలుకపై ఏర్పడే తెల్లటి పొర లేదా వెంట్రుకలు అధిక LDL కొలెస్ట్రాల్‌ను సూచిస్తాయి. అధిక కొలెస్ట్రాల్ నోటి మైక్రోబయోమ్‌ను మార్చడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడుతుంది.

ఆహారం మిండటంలో ఇబ్బంది (డిస్ఫాగియా).. రక్త నాళాలలో కొవ్వు ఏర్పడటం, అధిక కొలెస్ట్రాల్ వల్ల ఆహారం మింగడంలో ఇబ్బంది ఎదురవుతుంది. ఈ లక్షణం కొలెస్ట్రాల్ సమస్యల గురించి హెచ్చరిస్తుంది. ఇలా అధిక కొలెస్ట్రాల్ వివిధ లక్షణాల ద్వారా వ్యక్తమవుతుంది. వాటిలో కొన్ని నాలుకపై కనిపిస్తాయి. ఈ సంకేతాలను పర్యవేక్షించడం చాలా అవసరం, ఎందుకంటే అధిక కొలెస్ట్రాల్‌ను ముందుగానే గుర్తించడం, నిర్వహించడం ద్వారా గుండెపోటులు, స్ట్రోక్‌లతో సహా తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు. 30 ఏళ్ల వయస్సులో ఉన్న స్త్రీలు అంతగా తెలియని ఈ లక్షణాల గురించి ప్రత్యేకంగా అప్రమత్తంగా ఉండాలి.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker