Health

ఏమీ తినకపోయినా త్రేన్పులు ఎక్కువగా వస్తున్నాయా..? అది ప్రాణాంతక వ్యాధికి సంకేతం కావొచ్చు.

సరిగా నిద్ర లేకపోవడం ఒకటైతే తీసుకునే ఆహారాన్ని త్వరగా భుజించడం, సరిగా నమిలి తినకపోవడం మరో కారణం. అలాగే తీసుకునే ఆహారంలో మసాలా దినుసులతో కూడుకున్న ఆహారం ఉండటం. ధూమపానం, మద్యపానం సేవిస్తుండటం. తీసుకునే ఆహారం మోతాదుకి మించి ఎక్కువగా తీసుకోవటం మూలాన జీర్ణక్రియ సరిగా ఉండదు. అయితే ఏదైనా తిన్నప్పుడు లేదా తాగినప్పుడు త్రేన్పులు (బర్పింగ్) వస్తుంటాయి. ఇది జీర్ణక్రియ ప్రక్రియలో సహజమైన భాగం. కానీ పది మందిలో ఉన్నప్పుడు, తరచూ త్రేన్పులు వస్తుంటే ఇబ్బంది కరంగా ఉంటుంది. కొంతమంది వ్యక్తులకు రోజుకు 30 సార్ల దాకా త్రేన్పు వస్తుంది.

ఇది రోజువారీ జీవితానికి అంతరాయం కలిగించే స్థాయిలో ఉంటే, ఆ త్రేన్పులు అనారోగ్యాలకు సంకేతంగా భావించాలి. సాధారణం కంటే ఎక్కువగా త్రేన్పులు రావడం ఇబ్బందికరంగా లేదా రోజువారీ విధులకు అంతరాయం కలిగించేదిగా మారుతుంది. భోజనంతో సంబంధం లేకుండా నిరంతరం త్రేన్పులు వస్తే లేదా రోజుకు కొన్నిసార్ల కంటే ఎక్కువగా సంభవిస్తుంటే త్రేన్పులు అధికంగా వస్తున్నట్లు భావించాలి. అజీర్తి కారణమా:- గ్యాస్ట్రోఎంటరాలజీలో కరెంట్ ట్రీట్‌మెంట్ ఆప్షన్స్‌లో ప్రచురితమైన పరిశోధన ప్రకారం.. మితిమీరిన త్రేన్పులు రోజువారీ జీవితాన్ని, సోషల్‌ ఇంటరాక్షన్‌లను ప్రభావితం చేస్తాయి.

అజీర్తితో బాధపడే వారిలో దాదాపు 20% మంది తమ సామాజిక జీవితాల్లో అంతరాయాలు ఉన్నట్లు తెలిపారు. అజీర్ణంతో బాధపడుతున్న వారిలో సగం మంది వరకు అతి త్రేన్పులతో బాధపడుతున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. విపరీతమైన త్రేన్పులకు కారణాలు:- అతి త్రేన్పులకు రెండు ప్రధాన కారకాలు ఉన్నాయి. తినే సమయంలో లేదా తాగేటప్పుడు ఎక్కువగా గాలి మింగడం ఒక కారణం కాగా, రెండోది వైద్య పరిస్థితులు. గ్యాస్ట్రోఎసోఫాగియల్ రిఫ్లక్స్ డిసీజ్ (GERD), అల్సర్లు లేదా ఇతర జీర్ణ సమస్యలు.. కడుపులో ఆమ్లం తిరిగి అన్నవాహికలోకి ప్రవహించేలా చేస్తాయి. ఇది విపరీతమైన ఉబ్బరానికి దారితీస్తుంది.

దీంతో త్రేన్పులు ఎక్కువగా రావచ్చు. యాసిడ్ రిఫ్లక్స్‌తో సంబంధం ఉన్న త్రేన్పు తరచుగా గుండెల్లో మంట, కడుపులో ఆమ్లం పుంజుకోవడం వంటి లక్షణాలతో కూడి ఉంటుంది. భోజనం తర్వాత లేదా పడుకున్నప్పుడు ఇలా జరుగుతుంది. మరోవైపు జీర్ణవ్యవస్థలో గ్యాస్ కారణంగా ఇరిటబుల్‌ బౌల్‌ సిండ్రోమ్ (IBS) ఉన్న వ్యక్తులకు త్రేన్పులు ఎక్కువగా రావచ్చు. వీరికి తరచుగా కడుపు నొప్పి, మలవిసర్జనలో మార్పులు ఉంటాయి. ఉపశమనం ఎలా:- విపరీతమైన త్రేన్పులను తగ్గించడానికి జీవనశైలిలో మార్పులు చేయాలని వైద్యులు సిఫార్సు చేస్తున్నారు. ముఖ్యంగా భోజనం తక్కువ మొత్తంలో ఎక్కువ సార్లు తినాలి.

సోడాలు, కూల్‌డ్రింక్స్ వంటి కార్బోనేటేడ్ డ్రింక్స్‌ మానేయాలి. అలానే ఈ సమస్యను పెంచుతున్న ఆహారాలను గుర్తించి, వాటిని మానేయాలి. వైద్యుల సలహాతో మెడిసిన్:- GERD వంటి కడుపు ఆమ్ల సమస్యలు ఉన్నవారు, వైద్యుల సలహాతో ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ లేదా H2 బ్లాకర్స్ వంటి మందులు వాడాలి. యాసిడ్ రిఫ్లక్స్ లక్షణాలను తగ్గించడానికి మంచం తల భాగంలో ఎత్తుగా ఉంచాలి. పెప్టిక్ అల్సర్లకు యాంటీబయాటిక్స్, యాసిడ్ తగ్గించే మందులను వినియోగించాలి. ఒత్తిడిని తగ్గించడం, హైడ్రేటెడ్‌గా ఉండటం, ఆరోగ్యకరమైన బరువును మెయింటెన్ చేయడం ముఖ్యం.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker