ఈ కాలంలో వచ్చే పుట్టగొడుగులు తింటే ఆరోగ్య సమస్యలు వస్తాయా..?

పుట్టగొడుగులలో పొటాషియం, ప్రోటీన్, రాగి, సెలీనియం, భాస్వరం, యాంటీఆక్సిడెంట్లు, ఫైటోకెమికల్స్, విటమిన్లు సి, బి, డి వంటి అనేక పోషకాలు ఉన్నాయి. ఇవి మన శరీరాన్ని అనేక వ్యాధుల నుండి, ఇన్ఫెక్షన్ల నుండి కాపాడతాయి. పుట్టగొడుగులకు అధిక పోషక విలువలు ఉన్నాయి. ఇవి 92% నీటిని కలిగి ఉంటాయి. పుట్టగొడుగులలో కూడా అనేక విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి. అయితే పుట్టగొడుగులు అంటే కొంతమందికి చాలా ఇష్టం. కానీ వాటిని తినాలంటే కూడా కొన్ని అనుమానాలు ఉంటాయి.
వాటిలో విషపు పదార్థం ఉంటుందని కొంతమంది మాట్లాడుకుంటారు. భూమి చల్లబడినప్పుడు పుట్టగొడుగులు పెరగడం ప్రారంభిస్తాయి. పుట్టగొడుగులు తిన్న తర్వాత అనారోగ్యానికి గురవుతున్న వ్యక్తుల కేసులు కొన్ని విన్నప్పుడు, వర్షాకాలంలో పుట్టగొడుగులు సురక్షితంగా ఉన్నాయా అనే ప్రశ్న తలెత్తుతుంది. సీజనల్ ఫుడ్ ఆరోగ్యానికి మంచిదని అందరికీ తెలిసిందే. పుట్టగొడుగులు వర్షాకాలంలో (సహజంగా) మీకు లభిస్తాయి.
వర్షం పడి భూమి చల్లబడినప్పుడు, పుట్టగొడుగులు పెరగడం ప్రారంభిస్తాయి. రకరకాల పుట్టగొడుగులు పెరగడం ప్రారంభిస్తాయి. అన్ని రకాల పుట్టగొడుగులు తినదగినవి కావు. దీని గురించి తెలుసుకోవాలి. కొన్ని పుట్టగొడుగులు తినదగిన పుట్టగొడుగులవలె కనిపిస్తాయి, కానీ అవి విషపూరితమైనవి. వీటి ద్వారా వ్యాధి బారిన పడే అవకాశం కూడా ఉంది. పుట్టగొడుగులను సరిగ్గా ఉడికించాలి. లేదంటే ఆరోగ్య సమస్యలు రావచ్చు.
కాబట్టి పుట్టగొడుగులను వండేటప్పుడు, కుళ్ళిపోయే దశలో ఉన్న పుట్టగొడుగులను ఉపయోగించవద్దు. ఎందుకంటే వాటిలో బ్యాక్టీరియా ఉంటుంది. కాబట్టి అలాంటి పుట్టగొడుగులను తినకండి. వర్షాకాలంలో పెరిగిన పుట్టగొడుగులను తింటే పెద్దగా ఇబ్బందులు రావు. చింతించకుండా తినవచ్చు. కానీ మీరు పుట్టగొడుగులను తీసుకువస్తే, త్వరగా వండుకోండి. అవి కుళ్ళిపోయే దశలో ఉన్నప్పుడు వాటిని ఆహారం కోసం ఉపయోగించవద్దు.
వానకాలంలో తినే పుట్టగొడుగులను సరిగా గమనించండి. అవి తినదగినవే అయితే.. మాత్రమే తినండి. కొన్ని తినగదగినవిలా కనిపిస్తాయి.. వాటిని క్షుణ్ణంగా పరిశీలించాలి. పుట్టగొడుగులు తింటే చాలా మంచిది. అయితే వాటిని సరిగా చూసి తెచ్చుకోవాలి. వర్షాకాలంలోనూ పుట్టుగొడుగులు తినొచ్చు. కానీ తినే రకం మీదనే అంతా ఆధారపడి ఉంటుంది. కొన్ని రకాల ఫంగస్ ఉండే ప్రమాదం ఉంది.. మీరు ఎంత పరిశీలించి తెచ్చుకుంటే అంత మంచిది.