News

అమ్మాయిగా మారిన మరో జబర్దస్త్ కమెడియన్. ఎంత ఖర్చు అయిందో తెలుసా..?

జబర్దస్త్ ఎంతగా క్లిక్కయినా అప్పుడప్పుడు ఆ షో వివధాల్లోకి వెళుతూనే ఉంది. ఇక కమెడియన్స్ పై కూడా పలుమార్లు విమర్శలు వచ్చాయి. ఇక వివాదాలతో ఫేమస్ అయిన వారిలో సాయి తేజ ఒకరు. ప్రస్తుతం సాయి తేజ అదిరింది షోకి షిఫ్ట్ అయిన విషయం తెలిసిందే. అయితే ఒకప్పుడు సమాజంలో ఒక మగాడు ఆడదానిలా మారాలన్నా లేదా ఒక మహిళ ఒక పురుషుడి లాగా మారాలన్నా కూడా ఎంతో ప్రాసెస్ ఉండేది.

ముఖ్యంగా వాళ్లు అలా మారాక కూడా ఎన్నో అవమానాలను ఇబ్బందులను కూడా ఎదుర్కోవాల్సి వచ్చేది. పుట్టుకతోనే వచ్చిన ఆ లోపం వల్ల చుట్టూ ఉన్న వారితో ఎన్నో అవమానాలు ఎదుర్కొనేవారు కానీ ఇప్పుడిప్పుడే లోకం మారుతుంది. ముఖ్యంగా వారిది కూడా ఒక జీవితమే అని అర్థం చేసుకోవడం మొదలుపెట్టారు ప్రజలు. అంతేకాదు న్యాయపరంగా వారికి హక్కులు కూడా ఉన్నాయని న్యాయస్థానాలు చెప్పుకొస్తున్నాయి.

అందుకే చాలామంది ఇకపై స్వతంత్రంగా.. ధీమాగా.. హుందాగా తమకు నచ్చిన విధంగా తమను మార్చుకుంటున్నారు. ఈ క్రమంలోనే జబర్దస్త్ లో లేడీ కమెడియన్స్ గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. అందులో లేడీ గెటప్ వేసే వారిని వారి ఒరిజినల్ రూపంలో చూస్తే మాత్రం అస్సలు గుర్తుపట్టడం కష్టమే. ఇక జబర్దస్త్ లో లేడీ గెటప్ ద్వారా ఫేమస్ అయిన పింకీ బిగ్ బాస్ కి వెళ్లి అందరి మన్ననలు అందుకొని.. ప్రియాంక సింగ్ గా మారింది. మరో జబర్దస్త్ నటుడు కూడా ఇప్పుడు అమ్మాయిగా మారాడు.

అతడే సాయి లేఖ..ఈ మధ్యనే సర్జరీ చేయించుకొని లేడీగా మారిపోయిందని వార్తలు వస్తున్నాయి. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ.. నేను సర్జరీ చేయించుకోలేదు. ఒకవేళ సర్జరీ చేయించుకుంటేనే అమ్మాయిగా మారుతానా? నాకు చిన్నతనం నుంచి చీరలు కట్టుకోవడం ఇష్టం.. అలాంటి ఆలోచనలే ఊహ తెలిసినప్పటి నుండి మొదలయ్యాయి. ఇక ఎవరు ఏమనుకున్నా.. నాకు అనవసరం.. నేను నా కోసం బ్రతకాలనుకుంటున్నాను.

ఇక నేను సర్జరీ చేయించుకుంటే వారికి ఎందుకు? లేకపోతే వారికి ఎందుకు? అంటూ ఘాటుగా సమాధానం ఇచ్చింది సాయి లేఖ. ఆడపిల్లగా మారడానికి చాలా డబ్బులే ఖర్చు అయింది. ఎంత అయిందనే విషయాన్ని, సర్జరీ ఎక్కడ చేయించుకొన్నారు అనే ప్రశ్నలు నన్ను అడగవద్దు. నా సంపాదించిన డబ్బులతోనే నేను ట్రాన్స్ జెండర్‌గా మారాను. అయితే ట్రాన్స్ జెండర్‌గా మారడానికి లక్షలు ఖర్చు అయ్యాయని మాత్రం చెప్పగలను అని చెప్పుకొచ్చారు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker