News

ఇండస్ట్రీలో విషాదం, గుండెపోటుతో ప్రముఖ నటుడు మృతి.

మారి ముత్తు తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. నేరుగా తెలుగులో ఆయన నటించకపోయినా.. పలు తమిళ డబ్బింగ్‌ సినిమాలతో ఇక్కడి ప్రేక్షకులను పలకరించాడు. చినబాబు, పందెం కోడి-2, సుల్తాన్‌, డాక్టర్‌ వంటి సినిమాల్లో కీలకపాత్రలు పోషించాడు. ఎక్కువగా నెగెటీవ్‌ షేడ్స్‌ ఉన్న పాత్రల్లోనే మారిముత్తు కనిపించాడు. ఇక ఇటీవలే రిలీజైన జైలర్‌లో విలన్‌కు నమ్మకస్తుడిగా కీలకపాత్ర పోషించాడు.

శంకర్‌ తెరకెక్కిస్తున్న ఇండియన్‌-2లోనూ మారిముత్తు నటించాడు. అయితే నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రజినీకాంత్ హీరోగా సన్ పిక్చర్స్ బ్యానర్ పై తెరకెక్కించిన చిత్రం జైలర్.. ఈ సినిమా ఇటీవల విడుదలయ్యి అటు థియేటర్లలో ఇటు ఓటీటీ లో సత్తా చాటుతూ దూసుకుపోతోంది. ముఖ్యంగా ఈ సినిమా రూ.600 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసి నిర్మాతలకు లాభాలను అందించిన విషయం తెలిసిందే.

ఇకపోతే ఈ సినిమాలో విగ్రహాలను పరీక్షించే పన్నీర్ క్యారెక్టర్ , విలన్ కి నమ్మకస్తుడి క్యారెక్టర్ లో నటించిన మారిముత్తు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన నటనతోనే ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నారు . ఇంత గొప్ప నటుడు ఈరోజు కన్నుమూశారు. తమిళ నటుడిగా, డైరెక్టర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న జి మారిముత్తు ఈరోజు గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందడం అందరిని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.

100కు పైగా సినిమాలలో నటించిన ఈయన తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నారు. ఇదిలా ఉండగా తాజాగా ఈరోజు ఉదయం ఒక సీరియల్కి డబ్బింగ్ చెప్పిన ఆయనకి ఆ సమయంలో అకస్మాత్తుగా గుండెపోటు వచ్చిందని చెబుతున్నారు. ఇక బుల్లితెర సీరియల్స్ లో నటిస్తున్న మారిముత్తు యాంటీ స్విమ్మింగ్ అనే సీరియల్ తో బాగా ఫేమస్ అయ్యారు.

ఆయన రాసిన హే ఇందమ్మ అనే పద్యం ఇటీవల విస్తృతంగా చర్చనీయాంశమయ్యింది. అంతేకాదు కన్నుమ్ కన్నుమ్, పులి వాల్ అనే చిత్రాలకు దర్శకత్వం వహించిన ఈయన ఆ తర్వాత దర్శకుడు మిశ్కిన్ దర్శకత్వంలో వచ్చిన యుద్ధం సినిమా ద్వారా నటుడిగా అరంగేట్రం చేశారు. ఇక ఇప్పుడు రజినీకాంత్ జైలర్ చిత్రంలో కూడా నటించాడు. ఈ క్రమంలోనే ఆయన మరణించడంతో చిత్ర పరిశ్రమ దిగ్భ్రాంతికి గురి అయింది. అంతేకాదు పలువురు సినీ , రాజకీయ ప్రముఖులు మారిముత్తు మృతికి సంతాపం తెలియజేస్తున్నారు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker