బిగ్ షాక్, తెల్ల రేషన్ కార్డ్ ఉన్నా.. ఈ కుటుంబాలకు రూ. 500 కే గ్యాస్ సిలిండర్ ఇవ్వరు.
తెలంగాణలో సుమారు 90 లక్షల తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి. అందులో 64లక్షల కార్డులకు మాత్రమే గ్యాస్ కనెక్షన్లున్నట్టు పౌరసరఫరాల శాఖ గుర్తించింది. దీంతో మిగిలిన సుమారు 26 లక్షల కార్డులకు గ్యాస్ కనెక్షన్ లేనట్లే. అయితే తెలంగాణలో ఆరుగ్యారంటీలు అంటూ హామీల వర్షం గుప్పించిన కాంగ్రెస్.. స్పష్టమైన మెజార్టీతో అధికారంలోకి వచ్చింది. సీఎంగా బాధ్యతలు తీసుకున్న తర్వాత మహిళా సంక్షేమానికి రేవంత్ పెద్దపీట వేస్తున్నారు. పార్టీ అధికారంలోకి రాగానే ఫ్రీ బస్ పథకాన్ని అమలు చేశారు.
ఆ తర్వాత ఆరోగ్య శ్రీ పథకాన్ని 10 లక్షలకు పెంచారు. అధికారంలోకి వచ్చిన వందరోజుల్లోనే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని సీఎం రేవంత్ చెప్తున్నారు. ఐతే ఈ 6 గ్యారెంటీల్లో ఒకటైన మహాలక్ష్మిపథకంలో భాగంగా రూ.500 సిలిండర్ అందించేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమైంది. ఈ పథకంలో భాగంగా దరఖాస్తు చేసుకున్నవారిని ఆశాకార్యకర్తలు అర్హులైన లబ్దిదారులను ఎంపిక చేస్తారు.
ఈ కార్యకర్తలు డోర్ టూ డోర్ వెళ్లి రేషన్ కార్డుతోపాటు ఇతర ప్రభుత్వ గుర్తింపు ధృవపత్రాలను పరిశీలించనున్నారు. అర్హులైనవారి పూర్తి వివరాలను నమోదు చేసుకుంటారు. తెల్ల రేషన్ కార్డు కలిగి.. గ్యాస్ కనెక్షన్ ఉన్నవారికి మాత్రమే ఈ పథకం వర్తించనుంది. తెలంగాణలో సుమారు 90 లక్షల తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి. అందులో 64లక్షల కార్డులకు మాత్రమే గ్యాస్ కనెక్షన్ ఉన్నట్లు పౌరసరఫరాల శాఖ గుర్తించింది. దీంతో మిగిలిన సుమారు 26 లక్షల కార్డులకు గ్యాస్ కనెక్షన్ లేనట్లే.
ఈ లెక్కన 64 లక్షల కార్డుదారులకు మాత్రమే రూ. 500 గ్యాస్ వర్తించే అవకాశం ఉందని లెక్కలు చెప్తున్నాయి. అంటే 26లక్షల మందికి తెల్ల రేషన్ కార్డ్ ఉన్నా ఉపయోగం లేదు. ఈ 26లక్షల మందికి ఈ పథకంతో ఏ మాత్రం ఉపయోగం ఉండదు. ఐతే ఈ 26లక్షల మంది కొత్త గ్యాన్ కలెక్షన్స్ తీసుకుంటే మాత్రం.. ఈ పథకం వర్తించనుంది.