News

ఇన్నేళ్లకు మీడియా ముందుకు వచ్చి ఆ రహస్యాలను బయటకి చెప్పిన ఉదయ్ కిరణ్ సోదరి.

ఇప్పుడు ఈ రీ రిలీజుల సినిమాల లిస్టులోకి లవర్ బాయ్ ఉదయ్ కిరణ్ సినిమా కూడా చేరబోతోంది. ఉదయ్ కిరణ్- అనిత జటంగా నటించిన ఈ చిత్రం మరోసారి రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఉదయ్ కిరణ్ సోదరి ఎమోషనల్ అయ్యారు. అయితే ఉదయ్ కిరణ్ కు స్టార్ డమ్ తెచ్చిపెట్టిన చిత్రాల్లో నువ్వు నేను ఒకటి.

ఇందులో ఉదయ్ సరసన అనిత కథానాయికగా నటించగా.. దివంగత నటి శకుంతల.. తనికెళ్ల భరణి కీలకపాత్రలు పోషించారు. ఇప్పుడు ఈ సూపర్ హిట్ మూవీని మార్చి 21న రీరిలీజ్ చేయనున్నారు. దీంతో అటు సోషల్ మీడియాలో ఉదయ్ కిరణ్ ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. చాలా కాలం తర్వాత తమ అభిమాన హీరోను మళ్లీ బిగ్ స్క్రీన్ పై చూడొచ్చు అంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఈ క్రమంలోనే ఉదయ్ కిరణ్ సోదరి శ్రీదేవి చాలా సంవత్సరాలకు మీడియా ముందుకు వచ్చారు. నువ్వు నేను సినిమా గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. “నువ్వు నేను సినిమా మా అందరికి చాలా స్పెషల్. ఉదయ్ కు ఈ సినిమాకు గానూ బెస్ట్ యాక్టర్ అవార్డ్ కూడా వచ్చింది.

అంతేకాకుండా ఈ సినిమా రీరిలీజ్ తో మనం ఎంఎస్ నారాయణ, రాళ్లపల్లి, ధర్మవరపు సుబ్రమణ్యం, ఆహుతి ప్రసాద్, వైజాగ్ ప్రసాద్, తెలంగాణ శకుంతల వంటి లెజండరీ నటీనటులను మరోసారి థియేటర్లలో మనం ట్రిబ్యూట్ ఇచ్చేందుకు ఈ రీరిలీజ్ వేదిక అవుతుంది. ఈ సినిమా డైరెక్టర్ తేజ, మూవీ కి కంగ్రాట్యులేషన్స్.. అలాగే రిలీజ్ చేస్తున్నవారికి కృతజ్ఞతలు” అంటూ ఎమోషనల్ అయ్యారు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker