అతన్ని రహస్య వివాహం చేసుకున్న కీర్తి సురేష్..! అల్లుడికి ఫోన్ చేసి మేనక ఏమన్నారో తెలుసా..?
కీర్తి సురేష్ హోమ్లీ హీరోయిన్. ఆమెకు సిల్వర్ స్క్రీన్ పై క్లీన్ ఇమేజ్ ఉంది. వ్యక్తిగత జీవితంలో మాత్రం పలు రూమర్స్ ఆమె ఫేస్ చేసింది. హీరో విజయ్, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ లతో కీర్తి ఎఫైర్స్ పెట్టుకున్నట్లు వార్తలు వచ్చాయి. అలాగే కేరళకు చెందిన ఒక రిసార్ట్ ఓనర్ తో కీర్తి ప్రేమలో ఉన్నట్లు కథనాలు వెలువడ్డాయి. అయితే తాజాగా కోలీవుడ్ కమెడియన్ తో కీర్తి వివాహం జరిగినట్లు కోలీవుడ్ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
ఈ వార్తల మీద కీర్తి సురేష్ తల్లి స్పందించారు. కీర్తి సురేష్ పెళ్లి వార్తలు మాకు ఆశ్చర్యం తో పాటు వినోదం పంచుతాయి. సతీష్ తో పెళ్లి జరిగిందన్న రూమర్ విని నేను ఫన్నీగా ఫీల్ అయ్యాను. మీడియాలో తప్పుడు ప్రచారం ఎంత వేగంగా జరుగుతుందో చెప్పడానికి ఇది నిదర్శనం అని ఆమె అన్నారు. అలాగే కమెడియన్ సతీష్ కూడా ఈ విషయం మీద మాట్లాడారు. కీర్తి సురేష్ తో పెళ్లి వార్తల అనంతరం సతీష్ కి ఆమె తల్లి మేనక నుండి కాల్ వచ్చిందట.
సతీష్ ఒకింత భయపడ్డాడట. కాల్ లిఫ్ట్ చేద్దామా వద్దా అనుకున్నాడట. ఫోన్ ఎత్తగానే… మా కీర్తిని పెళ్లి చేసుకున్నందుకు నీకు కంగ్రాట్స్. హ్యాపీగా ఇద్దరూ కాపురం చేసుకోండి, అందట. మేనక ఫోన్ లో చెప్పిన మాటలు విని నవ్వుకున్నానని సతీష్ అన్నాడు.నిజానికి కీర్తి సురేష్- సతీష్ వివాహం చేసుకోలేదు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటో భైరవ చిత్ర పూజ కార్యక్రమంలో తీసింది.
భైరవ లో విజయ్-కీర్తి సురేష్ జంటగా నటించారు. సతీష్ కమెడియన్ రోల్ చేశాడు. అప్పటి ఫోటో వైరల్ చేస్తూ ఎవరో సతీష్-కీర్తి సురేష్ రహస్య వివాహం చేసుకున్నారని ప్రచారం చేశారు. ఈ వార్తలను సతీష్, మేనక తమదైన శైలిలో ఖండించారు. కీర్తి సురేష్ ప్రస్తుతం చేతినిండా చిత్రాలతో బిజీగా ఉంది. గత ఏడాది తెలుగులో దసరా, భోళా శంకర్ చిత్రాలు చేస్తున్నారు.