News

డైరెక్టర్ సూర్య కిరణ్ చావుకు ఆ జబ్బే కారణం, సంచలన విషయాలు చెప్పిన హీరోయిన్ కల్యాణి.

టాలీవుడ్ లో హిట్ సినిమాలకు దర్శకత్వం వహించిన డైరెక్టర్ సూర్యకిరణ్ మృతి చెందారు. సత్యం సినిమా సక్సెస్ కావడంతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో వరుస అవకాశాలు దక్కించుకున్న సూర్య కిరణ్ ..గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ సోమవారం తుది శ్వాస విడిచారు. దర్శకుడు సూర్య కిరణ్ చాలా కాలంగా డైరెక్షన్ ఫీల్డ్ కి దూరంగా ఉన్నారు. అయితే కల్యాణి గతంలో చాలా తెలుగు సినిమాల్లో హీరోయిన్ గా స్టార్ హీరోల పక్కన జోడి కట్టింది.

అయితే సూర్య కిరణ్ దర్శకుడిగా ఉన్న సమయంలో కల్యాణి నటనలో బిజీగా ఉండటంతో వీరిద్దరి మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయి. దాంతో ఈ సిని స్టార్ జోడి పెళ్లైన కొద్దిరోజులకే విడాకులకు దారి తీసింది. కల్యాణి నుంచి విడాకులు తీసుకున్న తర్వాత సూర్య కిరణ్ కెరియర్ కాస్త స్లో అయింది. నటుడిగా, దర్శకుడిగా పెద్దగా అవకాశాలు రాలేదు. దాంతో చివరకు తెలుగు రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ -4కి కంటెస్టెంట్ గా కూడా హౌస్ లోకి వెళ్లాడు సూర్య కిరణ్.

అయితే హౌస్ లో కాంపిటిషన్ గట్టిగా ఉండటంతో తక్కువ రోజుల్లోనే బయటకు వచ్చాడు. అయితే కల్యాణితో డైవర్స్ కారణం అడిగితే బెడ్రూం ఒకటే ఉన్నా మంచాలు వేరు వేరు అని చివరి సారిగా చేసిన ఓ ఇంటర్వూలో చెప్పి కన్నీరు పెట్టుకున్నాడు సూర్యకిరణ్. 48 ఏళ్ల సూర్యకిరణ్ తన బాలనటుల పాత్రలకు రెండుసార్లు కేంద్ర ప్రభుత్వ అవార్డులు, ఉత్తమ దర్శకుడిగా తెలుగు రాష్ట్ర నంది అవార్డును గెలుచుకున్నారు.

సూర్య కిరణ్ ఎవరో కాదు సీరియల్ నటి, పలు సినిమాల్లో సిస్టర్ క్యారెక్టర్స్ చేసిన సుజితకు స్వయాన సోదరుడు కావడం మరో విశేషం. సూర్య కిరణ్ మృతి పట్ల పలువురు అభిమానులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం చెన్నైలో అంత్యక్రియలు నిర్వహిస్తారు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker