News

బెంగుళూరు నుంచి స్పెషల్ ఫ్లైట్, మతిపోగొడుతున్న సుద్దపూసని రోహన్ రెమ్యూనరేషన్.

సాంప్రదాయని.. సుప్పినీ .. సుద్దపూసని అంటూ రోహన్ నవ్వులు పండించాడు. అదే విధంగా నటనతో ఆకట్టుకున్నాడు. 90s మిడిల్ క్లాస్ బయోపిక్ తర్వాత రోహన్ కి వరుస చిత్రాల్లో ఆఫర్స్ వస్తున్నాయి. అయితే సాంప్రదాయనీ .. సుప్పినీ .. సుద్దపూసనీ అంటూ సాగే కామెడీ లిరిక్ వల్ల రోహన్ కి సూపర్ క్రేజ్ వచ్చింది. ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ చేసే క్రమంలో యూట్యూబ్ ఛానల్స్ కి ఇంటర్వ్యూలు ఇస్తూ తెగ సందడి చేశాడు.

ఈ సక్సెస్ తో రోహన్ రేంజ్ మారిపోయింది. వరుస ఆఫర్లు అందుకుంటూ బిజీ ఆర్టిస్ట్ గా మారిపోయాడు. ప్రస్తుతం రెండు వెబ్ సిరీస్తో పాటు కొన్ని సినిమాలు రోహన్ చేతిలో ఉన్నాయి. మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి తో కలిసి ఓ భారీ ప్రాజెక్టు చేస్తున్నాడు. దీంతో ఈ బుడ్డోడు సీనియర్ ఆర్టిస్ట్ లాగా రోజు లెక్కన రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడట. సీరియల్స్ చేసే టైం లో రోహన్ రోజుకు రెండు మూడు వేల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకునేవాడట.

ప్రస్తుతం ఒక్క రోజుకి రూ. 30 వేలకు పైగానే డిమాండ్ చేస్తున్నాడట. పైగా అతని ఫ్యామిలీ మొత్తం బెంగళూరులో సెటిల్ కావడంతో ఫ్లైట్ టిక్కెట్లు, వసతి ఎక్స్ట్రా అట. ఈ లెక్కన రోజుకి యాభై వేల వరకు రోషన్ తీసుకుంటున్నాడట. అంటే రోహన్ రెమ్యూనరేషన్ సినిమాకు రూ. 5 నుంచి రూ. 20 లక్షలు ఉంటుందని అంచనా వేస్తున్నారు.

నటనే కాదు రోహన్ లో మరో స్పెషల్ టాలెంట్ ఉంది. మిమిక్రీ కూడా చేస్తాడట. వినయ విధేయ రామ చిత్రంలో రామ్ చరణ్ చిన్నప్పటి పాత్రలో మెప్పించాడు. కెరీర్ ప్రారంభంలో కల్యాణ వైభోగమే సీరియల్ లో చారు కేశవ పాత్రలో నటించి ప్రశంసలు అందుకున్నాడు. ఇప్పుడు ఏకంగా లక్షల్లో రెమ్యూనరేషన్ తీసుకుంటూ హాట్ టాపిక్ అవుతున్నాడు రోహన్.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker