ఉదయ్ కిరణ్ భార్య ఇప్పుడు ఏం చేస్తుందో..? ఎక్కడకు వెళ్తుందో తెలుసా..?

తెలుగు ఇండస్ట్రీపై ఉదయ్ వేసిన ముద్ర అలాంటిది మరి. చిత్రంగా ఇండస్ట్రీకి వచ్చి అంతే చిత్రంగా లోకాన్ని విడిచి వెళ్లిపోయాడు ఈయన. మధ్యలో కొన్నేళ్ల పాటు ధృవ తారగా వెలిగిపోయాడు. అనుకోని కారణాలు.. కొన్ని ఊహించిన కుదుపులతో పాపం బతకలేక ఆత్మహత్య చేసుకున్నాడు ఈ కుర్ర హీరో. ఉదయ్ కిరణ్ మరణానికి ఆర్థిక కారణాలే అని కొన్నేళ్లు వార్తలొచ్చాయి.
కానీ అది కారణం కాదంటూ ఆ మధ్య ఉదయ్ కిరణ్ అక్క సంచలన వ్యాఖ్యలు చేసింది. కుటుంబ కలహాలతోనే ఈయన చచ్చిపోయాడు అనే అర్థం వచ్చేలా మాట్లాడింది ఉదయ్ అక్క శ్రీదేవి. అయితే ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా టాలీవుడ్ లో అడుగు పెట్టి ఒక్కసారి సెన్సేషన్ సృష్టించాడు ఉదయ్ కిరణ్.
చిత్రం సినిమాతో హీరోగా పరిచయమైన ఉదయ్ కిరణ్ నువ్వు నేను, మనసంతా నువ్వే వంటి చిత్రాలతో వరుస హిట్ లని అందుకున్నాడు. తక్కువ కాలంలోనే ఎంతో ఎత్తుకు ఎదిగిపోయాడు ఉదయ్ కిరణ్. ఇతని తో సినిమా చేస్తే నష్టం రాదు అనే ఒక క్రేజ్ తెచ్చుకున్నాడు. అయితే కొంతమంది కుట్రలతో ఉదయ్ కిరణ్ కెరీర్ కొలాప్స్ అయింది. ఓ వైపు సినిమాలు ఫ్లాప్ అవుతుండటం మరో వైపు ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టడంతో ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకున్నాడు.
ఇప్పటికీ ఉదయ్ కిరణ్ ఆత్మహత్య ఒక మిస్టరీగానే ఉండిపోయింది. అయితే ఉదయ్ కిరణ్ మరణానికి కారణం తన భార్య విషిత అని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఉదయ్ కిరణ్ ఆర్థిక కష్టాల్లో ఉన్నప్పుడు అసహ్యించుకోవడం వల్లనే ఇలాంటి ఘోరం జరిగిందని టాక్ నడిచింది. అయితే ఉదయ్ కిరణ్ చనిపోయిన తర్వాత భార్య ఏం చేస్తుంది? ఎక్కడ ఉంది అన్న విషయాలు ఇప్పుడు చాలామందికి తెలియదు.
విషిత పెళ్లికి ముందు మంచి సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తోంది..పెళ్లి తర్వాత కూడా తన జాబ్ కంటిన్యూ చేసింది. ఉదయ్ కిరణ్ కి మంచి సపోర్ట్ ఇచ్చింది. ఉదయ్ కిరణ్ చనిపోయిన తర్వాత కూడా మరో పెళ్లి చేసుకోకుండా ఉండిపోయింది విషిత. భర్త పై ఉన్న ఇష్టంతో వేరొక పెళ్లి చేసుకోలేక ఒంటరిగానే ఉంటోంది.