ఉల్లితొక్కలను ఇలా వాడితే ఆ పవర్ దెబ్బకి మీకు ఎలాంటి వ్యాధులు రావు.
ఉల్లిపాయ తొక్కల్ని ప్రత్యేకమైన సువాసన కలిగిన ఉల్లిపాయ ఇన్ఫ్యూజ్డ్ వెనిగర్ తయారు చేయడానికి ఉపయోగించవచ్చు. వెనిగర్ ఉన్న బాటిల్‌లో ఉల్లిపాయ తొక్కలు వేసేసి గట్టిగా మూత పెట్టేయాలి. కొన్ని వారాల పాటు దాన్ని కదిలించకుండా అలాగే ఉంచండి. ఈ వెనిగర్‌ని సలాడ్ డ్రెస్సింగ్, మెరినేడ్ లో వాడుకోవచ్చు. అయితే వంటల్లో ఉల్లిపాయ లేకపోతే రుచి ఉండదు. ఉల్లిపాయ ప్రతి దాంట్లో వాడుతూ ఉంటాం. కొన్ని సార్లు పచ్చిగా కూడా తింటుంటాము. ఇది కేవలం రుచి కి మాత్రమే కాదు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.
ఉల్లిపాయలో శక్తివంతమైన పోషక విలువలు చాలా ఉన్నాయి. అయితే కేవలం ఉల్లిపాయ లే కాదు,ఉల్లి తొక్కలో కూడా చాలా పోషకాలు ఉన్నాయి. కానీ మనలో చాలామంది ఉల్లి ని ఉపయోగిస్తూ ఉల్లి తొక్కలను పారేస్తుంటారు. జుట్టు ఊడిపోతున్న, చుండ్రు సమస్య తో ఇబ్బంది పడుతున్న ఉల్లి తొక్కలతో పరిష్కరించుకోవచ్చు. ఉల్లి తొక్కల్ని నీటితో మెత్తగా నూరి ఆ పేస్ట్ ను తలకు పట్టించుకుని పావుగంట తర్వాత షాంపూతో తలస్నానం చేసేయాలి .
ఇది పనిచేస్తుందా లేదా అనే సందేహమే అవసరం లేదు ఎందుకంటే జుట్టు సమస్యలకు ఉల్లిపాయల తో పాటు తొక్కలు కూడా ప్రభావవంతంగా పనిచేస్తాయని పరిశోధనలు సైతం తెలియ చేస్తున్నాయి. ఉల్లి లో ఉండే సల్ఫర్ పాడైన, సన్నబడిన వెంట్రుకలు బలంగా ఉండేలా చేస్తుంది. ముఖ్యంగా తెల్ల బడిన జుట్టును ను గోధుమ, బంగారం రంగులో కి మార్చుతుంది. రాత్రంతా ఉల్లి తొక్కలను నీటిలో నానబెట్టుకోవాలి.
మరునాడు పొద్దున్నే ఆ నీటితో శరీరంలో నొప్పులు ఉన్న ప్రాంతాల్లో రాసుకుంటే నొప్పులు త్వరగా తగ్గుతాయి. ఆ నీటిని చర్మానికి రాసుకుని అరగంట తర్వాత స్నానం చేస్తే చర్మ సమస్యలు ఏమైనా ఉన్నా తగ్గుతాయి . ఇంట్లో దోమలు ఎక్కువగా ఉంటే ఒక గిన్నెలో నీరు పోసి అందులో కొన్ని ఉల్లి తొక్కలు వేసి కిటికీలు, గుమ్మాల దగ్గర ఉంచితే దోమలు బాధ ఉండదు.
ఎందుకంటే.. దోమలకు ఉల్లిపాయ వాసన, ఘాటు పడదు. ఉల్లి పొట్టులో ఫాస్ఫరస్,పొటాషియం, జింక్ పుష్కలంగా, గంధకం స్వల్పంగా ఉన్నాయి. ఇవన్నీ మొక్కలు పోషక లోపం లేకుండా, వేరు వ్యవస్థ బాగా బలంగా పెరగడానికి , ఆరోగ్యంగా పెరగడానికి బాగా ఉపయోగపడుతుంది.