ఇలా చేస్తే యూరిక్ యాసిడ్ సమస్య సింపుల్ గానే తగ్గిపోతుంది.

శరీరంలో యూరిక్ యాసిడ్ అనేది ఎక్కువగా ఉండటం వల్ల పలు సమస్యలు ఉత్పన్నమౌతాయి. ముఖ్యంగా వేళ్లు, మడమలు, ఎముకలు, జాయింట్స్‌లో తీవ్రమైన నొప్పి ఉంటుంది. శరీరంలో యూరిక్ యాసిడ్ అసాధారణంగా పెరిగితే ఆ స్థితిని హైపర్ యురిసీమియా అంటారు. అయితే ఈ చిట్కాలతో సులభంగా యూరిక్ యాసిడ్ సమస్య నుండి బయటపడుచు రక్తంలో యూరిక్ ఆసిడ్ పేరుకుపోవడం వలన కీళ్లు, కండరాల నొప్పులు వస్తూ ఉంటాయి.
ఈ నొప్పులతో విపరీతమైన ఇబ్బంది కలుగుతూ ఉంటుంది ఒక్కొక్కసారి మందులు వాడినా తగ్గకపోవచ్చు. నడవడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది. కీళ్ల నొప్పులను తగ్గించుకోవడానికి ఈ ఆయుర్వేద ఔషధాలు బాగా పనిచేస్తాయి. ఆర్థరైటిస్ తో పాటుగా అనేక నొప్పులని ఉసిరి దూరం చేస్తుంది. ఉసిరి వలన ఎన్నో లాభాలు ఉంటాయి.
శరీరంలో యూరిక్ ఆసిడ్ స్థాయిలని కూడా ఉసిరి తగ్గిస్తుంది. దాల్చిని కూడా బాగా ఉపయోగపడుతుంది దాల్చిన యూరిక్ ఆసిడ్ లెవెల్స్ ని తగ్గిస్తుంది. దాల్చిన చెక్క తేనెతో చేసిన కషాయాన్ని తీసుకుంటే యూరిక్ ఆసిడ్ లెవెల్స్ బాగా తగ్గిపోతాయి. నల్ల ఎండు ద్రాక్ష కూడా ఉపయోగపడుతుంది నీళ్లలో నానబెట్టుకుని ఉదయం లేవగానే దీన్ని తీసుకోవడం వలన యూరిక్ ఆసిడ్ లెవెల్స్ తగ్గుతాయి.
రాత్రి నిద్ర పోయే ముందు ఇలా మీరు నానబెట్టుకుని ఉదయాన్నే తీసుకుంటే చక్కటి ఫలితం ఉంటుంది. ప్రతిరోజు వేపాకుల్ని నమిలితే కూడా యూరిక్ ఆసిడ్ లెవెల్స్ బాగా తగ్గుతాయి. యూరిక్ ఆసిడ్ లెవెల్స్ ని తగ్గించడానికి అల్లం వెల్లుల్లి కూడా బాగా పనిచేస్తాయి. అల్లం పసుపు కలిపి కూడా తీసుకోవచ్చు.
త్రిఫల కూడా బాగా పనిచేస్తుంది త్రిఫల తీసుకుంటే కూడా యూరిక్ ఆసిడ్ లెవెల్స్ బాగా తగ్గిపోతాయి. ఈ చిట్కాలను చూశారు కదా ఇలా ట్రై చేసేయండి ఇక యూరిక్ ఆసిడ్ లెవెల్స్ తగ్గుతాయి ఆరోగ్యంగా ఉండొచ్చు ఇలాంటి సమస్యలు కూడా ఉండవు.