News

పూజ గదిలో అగర్బత్తులు వెలిగిస్తున్నారా..? మీరు ఎంత ప్రమాదంలో ఉన్నారో తెలుసుకోండి.

ఈమద్య కాలంలో అగరుబత్తికి అప్‌డేట్‌ వర్షన్‌ దూప్‌ స్టిక్స్‌ అంటూ వస్తున్నాయి. అబరుబత్తి పొగ చాలా మంచి వాసన వస్తుండటంతో దైవ భక్తి మరియు ఇల్లు చాలా సుగంద ద్రవ్యాల వాసన వస్తున్నట్లుగా, చాలా ఫ్రెష్‌గా ఉన్నట్లుగా అనిపిస్తుంది. అందుకే ఇంట్లో ప్రతి రూంలో లేదంటే కనీసం పూజ గదిలో అయినా అగరుబత్తిని ఎలిగించడం కామన్‌ అయ్యింది. అగరబత్తీలు అందరి జీవితంలో ఒక భాగం. వీటి నుంచి వచ్చే పరిమళమైన సువాసన మనలో నూతన ఉత్తేజాన్ని నింపుతుంది. అంతేకాదు మనం ఉంటున్న ప్రదేశంలో మంచి జరిగేలా ప్రేరేపిస్తుంది.

ఇదంతా వింటే ఎంత బాగా అనిపిస్తుందో కదా. కానీ వీటి వల్ల చెడు జరుగుతుంది అనేది కూడా అంతే నిజం అంటున్నారు కొందరు. అగర్బత్తుల వల్ల సమస్య రాదు కానీ వాటి నుంచి వచ్చే పొగ వల్ల సమస్య వస్తుందట. అయితే ప్రపంచం ఇప్పటికే పొగతో నిండిపోయి ఉంది. స్వచ్ఛమైన గాలి కరువైంది, కాలుష్యం ఎక్కువైపోయింది. మన పూర్వీకులు కాలుష్యరహిత పర్యావరణంలో జీవించారు. కానీ మనం మాత్రం కలుషితమైన గాలిని పీలుస్తున్నాం.

ఇలాంటి సమయంలో అగర్భత్తులు వెలిగించి మన చుట్టూ ఉన్న పొగను పెంచడం ఎంత వరకు కరెక్ట్ అంటున్నారు వైద్యులు. పరిశోధకులు ఇదే విషయంపై పరిశోధనలు చేసి ఒక నిశ్చిత అభిప్రాయానికి వచ్చారు. అదేంటంటే అగరబత్తులు మనకు హానీ చేస్తాయని చెబుతున్నారు. ఇంతకీ వీటి వల్ల ఎలా హానీ జరగుతుంది. అగర్బత్తులు ఎక్కువగా వాడితే అనారోగ్య సమస్యలు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా శ్వాసకోస సంబంధ సమస్యలు ఎదురవుతాయని చెబుతున్నారు.

దగ్గు, ఆస్తమా, ఎలర్జీలు, తలనొప్పి లాంటి ఇబ్బందులు తలెత్తుతాయని చెబుతున్నారు. రసాయనాలు ఉపయోగించి వీటిని తయారు చేస్తారట. ఫలితంగా కార్బన్ మోనాక్సైడ్ లాంటి ప్రమాదకర వాయువులు వెలువుడుతున్నాయని పేర్కొన్నారు. వాటిని పీల్చడం వల్ల అనారోగ్యపాలవుతారని వార్నింగ్ ఇస్తున్నారు వైద్యులు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker