News

విద్యార్థుల ముందు అదరగొట్టిన ఉపాసన స్పీచ్, మన ప్రతిభను ఎవరూ..!

ఉపాసన ప్రముఖ వ్యాపార వేత్త, అపోలో హాస్పిటల్స్ గ్రూప్ చైర్మన్ డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి మనమరాలు. ఉపాసన తల్లిదండ్రులు శోభ కామినేని, అనిల్ కామినేని..ఉపాసనకి నలుగురు అక్కా చెల్లెల్లున్నారు. వీరిలో ఉపాసన రెండోది. అయితే సినీ హీరో రామ్ చరణ్ సతీమణి ఉపాసన అన్నారు. సంగారెడ్డి జిల్లా రుద్రారంలో గల గీతం యూనివర్సిటీ లో జరిగిన వార్షిక విద్యార్థి ఉత్సవం ప్రమాణ కార్యక్రమంలో రామ్ చరణ్ సతీమణి ఉపాసన పాల్గొన్నారు. ఈ సందర్భంగా గీతం వార్షిక విద్యార్థి ఉత్సవ ప్రమాణ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఉపాసనకు ఘన స్వాగతం లభించింది.

అనంతరం ఉపాసన ప్రసంగిస్తూ… ప్రతిభకు పేద, ధనిక కొలమానం ఉండదని, అదే రీతిలో లింగ భేదం సైతం ఉండదన్న విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తించాలన్నారు. అంతేకాకుండా ఒక మహిళగా తన శక్తి సామర్థ్యాలు తనకు తెలుసని, నేటి కాలంలో మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తూ ఆదర్శవంతులుగా నిలవడం తనకు ఆనందంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరూ తమ అత్యుత్తమ ప్రదర్శనతో భావిభారత పౌరులుగా తీర్చిదిద్దబడాలని అప్పుడే తల్లిదండ్రులు కలలు గన్న మన భవిష్యత్తు సాకారం అవుతుందన్నారు.

ఈ విషయాన్ని నేటి యువత గమనించి ప్రతి వృత్తిలో స్కిల్స్ పెంచుకుని, స్వయంగా ఉపాధి పొందుతూ రాణించేందుకు ముందుకు సాగాలన్నారు. మన ప్రతిభను ఎవరూ దోచుకోవడం కుదరని పరిస్థితిగా, ఎందరో పేద కుటుంబాల నుండి వచ్చి పారిశ్రామిక వేత్తలుగా గుర్తించబడ్డ విషయాన్ని ప్రతి ఒక్క విద్యార్థి గమనించాలన్నారు. పట్టుదల తో అనుకుంటే సాధించే గుణం మనలో అధికంగా ఉంటుందని, అదే పట్టుదల తో ప్రతి విద్యార్థి విజయాలను అందుకోవాలన్నారు.

అనంతరం ఆత్మీయ అతిథిగా హాజరైన ఉపాసనను గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ డైరెక్టర్ వి.ఆర్.శాస్త్రి ఘనంగా సన్మానించారు. అలాగే పలువురు ముఖ్య అతిధులు సైతం కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. పలువురు విద్యార్థులు, ఉపాసన ప్రసంగిస్తున్న సమయంలో కేకలతో హోరెత్తించగా, ఉపాసన సైతం చిరునవ్వుతో యువత కేరింతలను స్వీకరించారు. అయితే ఉపాసన తో సెల్ఫీలు దిగేందుకు యువత పోటీ పడ్డారు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker