Uric Acid: ఇలా చేస్తే యూరిక్ యాసిడ్ సమస్య కొన్ని రోజుల్లోనే పూర్తిగా తగ్గిపోతుంది.

Uric Acid: ఇలా చేస్తే యూరిక్ యాసిడ్ సమస్య కొన్ని రోజుల్లోనే పూర్తిగా తగ్గిపోతుంది.
Uric Acid: మన శరీరంలో ఆహారం జీర్ణమయ్యే క్రమంలో ప్యూరిన్‌లు విచ్ఛిన్నం అయినప్పుడు యూరిక్ యాసిడ్ ఉత్పత్తి అవుతుంది. ఇది సాధారణంగా మూత్రం ద్వారా శరీరం నుండి బయటకు వెళుతుంది. రక్తంలో యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరిగినప్పుడు (హైపర్‌యూరిసెమియా), అది స్ఫటికాలుగా మారి కీళ్లలో పేరుకుపోతుంది. దీని వల్ల వచ్చే నొప్పి సమస్యనే గౌట్ అంటారు. అయితే నిజానికి, యూరిక్ యాసిడ్ నియంత్రణ అనేది కేవలం మందులతో అయ్యే పని కాదు.
Also Read: నోటి పూతే కదా అని నిర్లక్ష్యం చేస్తున్నారా..?
మంచి ఆహారం తీసుకోవడం, తగినంత నిద్ర, సరైన జీవనశైలి అలవాట్లతో యూరిక్ యాసిడ్ స్థాయిని సమతుల్యం చేసుకోవచ్చు. ఈ జీవనశైలి మార్పులతో పాటు, ఇంట్లోనే సులభంగా తయారుచేసుకోగలిగే కొన్ని సహజ నివారణలు అద్భుతమైన ఫలితాలను ఇస్తాయి. ఈ సమస్యకు చక్కటి పరిష్కారంగా ఆయుర్వేద నిపుణురాలు రిచా అగర్వాల్ ఒక రుచికరమైన ఉపాయాన్ని సూచిస్తున్నారు.. అదే పుదీనా-వెల్లుల్లి చట్నీ.

Also Read: ఈ లక్షణాలు కనిపిస్తే అపెండిక్స్ క్యాన్సర్ ఉన్నట్లే..!
పుదీనా, వెల్లుల్లి రెండూ శక్తివంతమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కలిగి ఉంటాయి. యూరిక్ యాసిడ్ పెరగడం వల్ల వచ్చే కీళ్ల వాపు, నొప్పుల నుండి ఈ చట్నీ ఉపశమనం కలిగిస్తుంది. వెల్లుల్లి శరీరంలోని విషపదార్థాలను తొలగించి, రక్తాన్ని శుద్ధి చేయడానికి, జీర్ణవ్యవస్థను మెరుగుపరచడానికి సహాయపడుతుంది. పుదీనా యాంటీఆక్సిడెంట్లను అందించి, రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
Also Read: ఈ ధనియాల నీరు రోజు తాగితే చాలు.
ఈ రెండు పదార్థాలు కలిసినపుడు, అవి యూరిక్ యాసిడ్ స్ఫటికాలను కరిగించే ప్రక్రియను వేగవంతం చేస్తాయి. ఇక యూరిక్ యాసిడ్ నియంత్రణకు దోహదపడే ఈ చట్నీని తయారుచేసుకోవడం చాలా సులభం. కావలసిన పదార్థాలు.. ఒక గుప్పెడు తాజాగా ఉన్న పుదీనా ఆకులునాలుగు నుండి ఐదు వెల్లుల్లి రెబ్బలు1-2 పచ్చిమిర్చి1 టీస్పూన్ ఆవాల నూనెరుచికి సరిపడా ఉప్పు.
Also Read: ఈ మొక్కతో తింటే చాలు, స్త్రీ, పురుషులిద్దరికీ వెయ్యి ఏనుగుల బలం వస్తుంది.
తయారీ ప్రక్రియ.. ముందుగా పుదీనా ఆకులను శుభ్రం చేసి, మెత్తగా రుబ్బడానికి సిద్ధం చేసుకోవాలి.మిక్సీ జార్‌లో పుదీనా ఆకులు, వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి వేసి మెత్తగా పేస్ట్ అయ్యేవరకు రుబ్బాలి. రుబ్బిన పేస్ట్‌లో రుచికి ఉప్పు, ఒక టీస్పూన్ ఆవాల నూనె వేసి బాగా కలపాలి.అంతే, యూరిక్ యాసిడ్ నియంత్రణకు సహాయపడే రుచికరమైన పుదీనా-వెల్లుల్లి చట్నీ సిద్ధమైంది.