News

పెళ్లి తర్వాత వరుణ్ ని ఇబ్బంది పెడుతున్న లావణ్య, ఎట్టకేలకు అసలు విషయం చెప్పిన మెగా హీరో.

వరుణ్.. పెళ్లి తర్వాత వచ్చిన ఫస్ట్‌ వాలంటైన్స్‌ డే కదా.. మీ భార్య లావణ్య నుంచి ఎలాంటి కానుక అందింది అని అడగ్గా.. ఈ ఏడాది తను ఏ కానుక ఇవ్వలేదు. నేను కూడా ఆమెకు ఏం ఇవ్వలేదు. కానీ వాలంటైన్స్‌ డే సందర్భంగా కాశ్మీర్‌కు వెకేషన్‌కు వెళ్లడం. ఆ స్పెషల్‌ డేను మంచు కొండల్లో సెలబ్రేట్‌ చేసుకున్నాం” అని చెప్పుకొచ్చాడు. అయితే మొదటిసారి పెళ్లి తర్వాత జీవితంలో ఎలా ఉందో వరుణ్ తేజ్ వెల్లడించారు.

వరుణ్ తేజ్ లేటెస్ట్ మూవీ ఆపరేషన్ వాలెంటైన్ విడుదలకు సిద్ధం కాగా… ప్రమోషన్స్ లో వరుణ్ తేజ్ పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా యాంకర్ సుమ… పెళ్లి అనంతరం జీవితంలో వచ్చిన మార్పులు ఏంటని అడిగారు. సుమ ప్రశ్నకు వరుణ్ తేజ్ ఫన్నీగా సమాధానం చెప్పారు. ఫోన్ కాల్స్ ఎక్కువ వస్తున్నాయి. ఎక్కడికి వెళుతున్నావనే ప్రశ్న పదే పదే ఎదురవుతుందని చెప్పాడు.

వరుణ్ తేజ్ కామెంట్స్ గమనిస్తే లావణ్య కొంత ఇబ్బంది పెడుతుందని. వరుణ్ తేజ్ స్వేచ్ఛ కోల్పోయాడనే భావన కలుగుతుంది. భార్య అన్నాక తప్పదు మరి. గంటకో కాల్ చేయడం. షర్ట్ వేసుకోగానే ఎక్కడకు అని అడగటం వెరీ కామన్. అందరు భర్తల వలె వరుణ్ ఈ తరహా అనుభవాలు ఎదుర్కొంటున్నాడన్న మాట. ఈ ఇంటర్వ్యూలో మరికొన్ని విశేషాలు వరుణ్ తేజ్ పంచుకున్నారు.

స్క్రిప్ట్ సెలక్షన్ లో పెదనాన్న చిరంజీవి తనకు స్ఫూర్తి అని చెప్పాడు. పవన్ కళ్యాణ్ బాబాయ్ లోని నిజాయతీ నచ్చుతాయని వరుణ్ తేజ్ చెప్పుకొచ్చాడు. ఆపరేషన్ వాలెంటైన్ చిత్రం ఒప్పుకోక ముందు పుల్వామా సంఘటన గురించి నాకు కొంత అవగాహన ఉంది. ఇప్పుడు పూర్తిగా ఆ సంఘటన గురించి తెలుసు… అని వరుణ్ తేజ్ అన్నారు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker