చిత్రపరిశ్రమలో విషాదం, సీనియర్ హీరోయిన్ కన్నుమూత.
అంజనా భౌమిక్ డిసెంబర్ 1944లో జన్మించారు. ఆమె అనిల్ శర్మ అనే నావికాదళ అధికారిని వివాహం చేసుకున్నారు. వీరికి నీలాంజన, చందన అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తె నీలాంజనా ఒకప్పుడు తన తల్లిలాగే నటి. ఆమె ‘హిప్ హిప్ హుర్రే’ అనే టీవీ షోలో కనిపించింది. అయితే, నీలాంజనా చాలా సంవత్సరాలుగా నటనకు దూరంగా ఉంది. భర్త జిషు సేన్‌గుప్తాతో కలిసి కోల్‌కతాలో నివసిస్తోంది. అయితే సీనియర్ హీరోయిన్ అంజనా భౌమిక్(79) కన్నుమూశారు. గత కొంతకాలంగా అంజనా భౌమిక్ శ్వాసకోస సమస్యతో బాధ పడుతున్నారు.
ఈక్రమంలోనే ఆమె ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు. శనివారం అంజనా ఆరోగ్య పరిస్థితి విషమించి తుదిశ్వాస విడిచారు. అంజనా భౌమిక్ అసలు పేరు ఆరతి. కూచ్ బిహార్‌లో ఆమె జన్మించారు. చదువు కోసం కోల్‌కతా వెళ్లిన ఆమె అక్కడే స్థిరపడి పోయారు. సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన అంజనా ‘అనుస్టూప్ ఛంద’ అనే చిత్రంతో అందరి దృష్టిని ఆకర్షించారు. ‘థానా థేకే అస్చీ’ బెంగాలీ చిత్రంలో స్టార్ డమ్ పొందిన ఆమెకు ఆ తరువాత వరుస సినిమాల ఆఫర్లు వచ్చాయి.
‘కహోనా మేఘ్’, ‘థానా థేకే అస్చీ’, ‘చౌరంగీ’ లాంటి క్లాసిక్ సినిమాల్లో నటించి తనదైన నటనతో ఆకట్టుకున్నారు అంజనా భౌమిక్. అప్పట్లో అంజనా అందానికి, నటనకు యువత ఫిదా అయ్యారు. అంజనా భౌమిక్ కు అప్పటి తరం యువతలో ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అయితే వారందరిని బాధ పెడుతూ.. నావీ అధికారి అయిన అనిల్ శర్మను వివాహం చేసుకుని సినిమాకు దూరమయ్యారు. ఇక సినీ ఇండస్ట్రీలో ఆమె కృషి పలు అవార్డులు సైతం వరించాయి. 2012లో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నుంచి జీవిత సాఫల్య పురస్కారాన్ని అందుకున్నారు.
అంజనాకు నీలాంజనా సేనాగుప్తా, చందనా శర్మ అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. నీలాంజనా ప్రముఖ యాక్టర్ జిష్షు సేన్‌గుప్తాను వివాహం చేసుకుంది. అంజనా మృతిపట్ల బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంతాపం తెలిపారు. అలానే పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆమె మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరి.. సీనియర్ హీరోయిన్ మృతిపట్ల మీ సంతాపాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.