News

ప్రభాస్ కి పెళ్లికాకపోవడానికి కారణం ఇదే అంటున్న వేణు స్వామి, పరిష్కారం ఏంటో కూడా..?

వేణు స్వామి ఈమధ్య వచ్చిన సలార్ సినిమా విషయంలో ఎక్కువగా విమర్శలకు గురయ్యారు. ఎందుకంటే అసలు ప్రభాస్ సినిమాలే హిట్ అవ్వవు అన్నారు మరి ఇప్పుడు ఈ సినిమా ఏమైంది అని చాలామంది వేణు స్వామిని ట్యాగ్ చేస్తూ సోషల్ మీడియాలో నెగిటివ్ పోస్టులు పెట్టారు. ఇక ఈ విషయంలో వేణు స్వామి కూడా పరోక్షంగా స్పందించి నాలుగు సినిమాలు చేస్తే ఒక్క సినిమా హిట్ అవ్వడం కాదు.నాలుగు సినిమాలు చేస్తే మూడైన హిట్ అవ్వాలి. అయినా ప్రభాస్ ఆరోగ్యం గురించి మీకేం తెలుసురా వెధవల్లారా.. అంటూ రీసెంట్ గా ఆ ఇంటర్వ్యూలో వేణు స్వామి ప్రభాస్ అభిమానులపై ఫైర్ అయ్యారు.

ప్రభాస్ పెద్దమ్మ పెదనాన్న ఆయన పెళ్లి విషయంలో చాలా సీరియస్ గా ఉన్నారని. త్వరలో పెళ్లి అంటూ కథనాలు వెలువడ్డాయి. ప్రభాస్ పెదనాన్న కృష్ణం రాజు ఈ లోకాన్ని కూడా వీడారు. ప్రభాస్ కి మాత్రం పెళ్లి కాలేదు. అసలు ప్రభాస్ ఎందుకు వివాహం చేసుకోవడం లేదు, అనే సందేహాలు ఉన్నాయి. ఆ మధ్య బాలకృష్ణ ఇదే విషయాన్ని ప్రభాస్ ని అడిగాడు. సల్మాన్ పెళ్లి తర్వాతే నా పెళ్లి అని ప్రభాస్ తెలివిగా తప్పుకునే ప్రయత్నం చేశాడు. బాలయ్య వదలకుండా మళ్ళీ మళ్ళీ అడగడం తో ఆ రోజు రావాలి.

ఎందుకో కావడం లేదని అస్పష్టమైన సమాధానాలు చెప్పాడు. అయితే ప్రభాస్ కి ఎందుకు పెళ్లి కావడం లేదో, వేణు స్వామి మరోసారి వెల్లడించారు. అందుకు కారణాలు ఏమిటో తెలియజేశాడు. ఆయన మాట్లాడుతూ… నేను ఏం మాట్లాడినా ప్రభాస్ ఫ్యాన్స్ నన్ను ట్రోల్ చేస్తుంటారు. ప్రభాస్ గురించి నాకు మొత్తం తెలుసు. ఆయన మొదటి సినిమా ఈశ్వర్. ప్రభాస్ సినిమాల్లోకి ఎలా వచ్చాడో కూడా నాకు తెలుసు. ఇక ప్రభాస్ కి పెళ్లి కాకపోవడానికి కారణం ఆయన జాతకంలో దోషం ఉంది. అందుకే పెళ్లి ఘడియలు రావడం లేదు. దోష నివారణ చేస్తేనే పెళ్లి జరుగుతుందని… మరోసారి చెప్పుకొచ్చాడు.

వేణు స్వామి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. కాగా గతంలో ప్రభాస్ ఆరోగ్యం మీద వేణు స్వామి నెగిటివ్ కామెంట్స్ చేశాడు. సలార్ మూవీ కూడా ప్లాప్ అవుతుందని అన్నాడు. వేణు స్వామి కామెంట్స్ పై మండిపడ్డ ప్రభాస్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో అతన్ని ట్రోల్ చేశారు. మరోవైపు ప్రభాస్ వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఆయన నటిస్తున్న కల్కి 2829 AD, రాజా సాబ్ చిత్రాలు సెట్స్ పై ఉన్నాయి. సలార్ 2, స్పిరిట్ చిత్రాలు చేయాల్సి ఉంది. కల్కి మే 9న విడుదల కానుంది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker