News

ఈ ఏడాది ఆ స్టార్ హీరో చనిపోతాడా..! మరో బాంబు పేల్చిన వేణు స్వామి.

సోషల్ మీడియా విపరీతంగా అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో వేణు స్వామి లాంటి వారు చాలామంది సోషల్ మీడియా ద్వారా ప్రాచుర్యం లోకి వచ్చారు. అంతకుముందు ఏం చేసేవారో తెలియదు కానీ ఇప్పుడు మాత్రం సెలబ్రిటీల పర్సనల్ లైఫ్ ల గురించి వారి జాతకాల గురించి సోషల్ మీడియాలో మాట్లాడుతూ పలు యూట్యూబ్ ఛానల్స్ కి ఇంటర్వ్యూలు ఇస్తూ ఫేమస్ అయిపోతున్నారు.

అయితే సినిమా పరిశ్రమలో మంచి పేరు, ప్రతిష్టలు కలిగిన ఒక స్టార్ హీరో త్వరలోనే మరణించనున్నాడు అని ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి చెప్పిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆ హీరో ఎవరు? అనే విషయమై సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

కొందరైతే ఆ హీరో 2024లోనే మృతిచెందనున్నాడంటూ ప్రచారం చేస్తున్నారు. ప్రస్తుతం ఆ కథానాయకుడి ఆరోగ్యం బాగోలేదని, విదేశాల్లో చికిత్స తీసుకుంటున్నాడని వేణుస్వామి చెబుతున్నాడు. అతని ఆరోగ్యం పూర్తిగా దెబ్బతిందని, మరణించనున్నాడంటూ చెప్పాడు.

సోషల్ మీడియాలో ఆ హీరో అతనే అంటూ ఎవరికి తోచిన పేరును వారు ట్రెండ్ చేస్తున్నారు. మా హీరో చక్కగా ఉన్నాడని, ఆరోగ్యం చాలా బాగుందని, నోరుంది కదా అని నోటికొచ్చింది వాగేస్తారా..?

వాడెవడో చెప్పడం.. మీరు వాగడం.. వెళ్లి మీ పనులు చూసుకోండి అంటూ హీరోల అభిమానులు మండిపడుతున్నారు. ప్రస్తుతం వేణుస్వామి పేరు సామాజిక మాధ్యమాల్లో ట్రెండ్ అవుతోంది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker