News

విజయ్‌ దేవరకొండపై అమ్మాయిల వీడియో..బంపర్ ఆఫర్ ఇచ్చిన హీరో.

చాలా మంది అమ్మాయిలు విజయ్ లుక్స్ కి …యాటిట్యూడ్ కే పడేపోయారు. అలాంటి ఫ్యాన్స్ లో ఈ అమ్మాయిలు ముందుఉంటారేమో..రీసెంట్‌గా ఇద్దరు విద్యార్ధినులు విజయ్ కోసం పెట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే బెంగళూరులో చదువుకుంటున్న హర్షిత రెడ్డి అనే సస్టూడెంట్‌ త‌న ఫ్రెండ్‌తో క‌లిసి సోష‌ల్ మీడియాలో ఒక రీల్ క్రియేట్ చేసింది. ‘ విజయ్ దేవరకొండ ఈ వీడియోకి కామెంట్ చేస్తే తాము పరీక్షలకు ప్రిపేర్ అవుతాం’ అంటూ ఈ వీడియో ఉంది.

షేర్ చేసిన కొద్ది క్షణాల్లోనే ఈ వీడియో నెట్టింట బాగా వైరలైంది. చివరకు విజయ్‌ దేవరకొండ దాకా వెళ్లింది వీడియో. దీనిని చూసిన హీరో వెంటనే స్పందించాడు. ‘ 90 శాతం మార్కులు తెచ్చుకో.. కచ్చితంగా నేను నిన్ను కలుస్తాను’ అంటూ క్యూట్‌గా రిప్లై ఇచ్చాడు. దీంతో ఆ ఇద్దరు విద్యార్థినుల ఆనందానికి హద్దుల్లేకుండాపోయింది. విద్యార్థినులు అభిమానంతో వీడియో చూసినా.. విజయ్ స్పందించిన తీరు అభిమానులను ఇంప్రెస్‌ చేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ గా మారింది.

ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో ఫ్యామిలీ స్టార్ అనే సినిమాలో నటిస్తున్నాడు విజయ్‌ దేవరకొండ. సీతారామం, హాయ్ నాన్నల బ్యూటీ మృణాళ్‌ ఠాకూర్‌ ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌లో దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన టీజర్‌, గ్లింప్స్‌, సాంగ్ ఆడియెన్స్ ను అమితంగా ఆకట్టుకున్నాయి. చాలా భాగం షూటింగ్ పూర్తి చేసుకున్న ఫ్యామిలీ స్టార్ ఏప్రిల్‌ 5న థియేటర్లలోకి అడుగుపెట్టనున్నాడు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker