News

విజయ్ సేతుపతి లవ్ స్టోరీ ముందు ఏ సినిమా స్టోరీ పనికి రాదు. ఆన్‏లైన్‏లో చాటింగ్ చేస్తూ..!

తాను స్కూల్ లో చదువుతున్న సమయంలో ఓ అమ్మాయిని ప్రేమించానని, కానీ ఆ అమ్మాయి మాత్రం తనను ప్రేమించలేదని విజయ్ సేతుపతి లిపాడు. పైగా తనకు షారుఖ్ ఖాన్ అంటే అమితమైన ఇష్టమని అతడిని ప్రేమిస్తున్నట్లు చెప్పిందని విజయ్ సేతుపతి వెల్లడించాడు. అప్పట్నుంచి హీరో షారుఖ్ ఖాన్ పై పగ పెంచుకున్నానని, ఆ పగను జవాన్ సినిమా ద్వారా తీర్చుకున్నానని విజయ్ సేతుపతి తెలిపాడు.

అయితే ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్న విజయ్ సేతుపతి జీవితంలో ఎదుర్కొన్న ఒడిదుడుకులు.. ఆయన ప్రేమ, పెళ్లి గురించి ఇటీవల ఓ ఇంటర్వ్యులో చెప్పుకొచ్చారు. విజయ్ సేతుపతి తన నటనా జీవితం ప్రారంభించక ముందు అకౌంటెంట్‌గా పనిచేశాడు.

నవంబర్ 2000లో, ముంబైలో కొన్ని చిన్న చిన్న ఉద్యోగాలు చేసిన తర్వాత విజయ్ అకౌంటెంట్‌గా పని చేయడానికి దుబాయ్‌కి వెళ్లాడు. ఆ సమయంలో అతని జీతం రూ.12,000. ఇక విజయ్ సేతుపతి తన సతీమణి జెస్సీని చూడకుండానే ప్రేమించారు. దుబాయ్ లో పనిచేస్తున్న సమయంలో తన భార్య జెస్సీ కూడా దుబాయ్ లో ఉండేదని..

ఫేస్ బుక్ చాటింగ్ ద్వారా తాము స్నేహితులమయ్యామని అన్నారు. ఇక ప్రస్తుతం భారీ వసూళ్లతో దూసుకుపోతున్న జవాన్ చిత్రానిగానూ విజయ్ సేతుపతికి దాదాపు రూ.21 కోట్లు పారితోషికం ఇచ్చినట్లుగా తెలుస్తోంది.

అయితే ఫిట్నెస్, డైటింగ్ అనే విషయాలను ఎక్కువగా పట్టించుకోనని.. రుచికరమైన ఆహారాన్ని తినడానికి ముందుంటానని అన్నారు. రుచికరమైన ఆహారం తినకపోతే జీవితం కూడా రుచిగా ఉండదని తాను నమ్ముతున్నట్లు తెలిపారు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker