News

చెల్లిని ఇంటి నుండి గెంటేసిన యాంకర్ విష్ణుప్రియ, తర్వాత ఏం చేసిందో తెలుసా..?

విష్ణుప్రియ రెమ్యూనరేషన్ విషయానికి వస్తే.. ఆమె ఒక్కో షోకి 50 నుండి 70 వేలు అందుకుంటుందని తెలుస్తోంది. ఇక ఈ భామకు ప్రభాస్, అల్లు అర్జున్ ఇష్టమైన హీరోలని తెలుస్తోంది. విష్ణు ప్రియకు ఫేవరెట్ హీరోయిన్స్ విషయానికి వస్తే.. ఆమెకు అనుష్క, సమంతలు ఎంతో ఇష్టమట. అయితే గ్లామరస్ తెలుగు యాంకర్స్ లో విష్ణుప్రియ ఒకరు. పోవే పోరా షోతో ఆమె పాపులర్ అయ్యారు. కెరీర్ బిగినింగ్ లో ఆమె యూట్యూబ్ వీడియోలు చేసేవారు. యాంకర్ అయ్యాక ఆమె ఫేమ్ రాబట్టింది. సోషల్ మీడియాలో హాట్ ఫోటో షూట్ చేస్తూ యూత్ లో ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది.

విష్ణుప్రియ బోల్డ్ వీడియోలు, ఫోటో షూట్స్ సోషల్ మీడియాను షేక్ చేశాయి. బుల్లితెర మీద విష్ణుప్రియ హవా తగ్గింది. ఆమె నటిగా రాణించే ప్రయత్నాలు చేస్తుంది. గత ఏడాది దయ టైటిల్ తో ఒక వెబ్ సిరీస్ చేసింది. జేడీ చక్రవర్తి ప్రధాన పాత్ర చేసిన ఈ క్రైమ్ థ్రిల్లర్ లో విష్ణుప్రియ జర్నలిస్ట్ రోల్ చేసింది. విష్ణుప్రియ పూర్తి నిడివి కలిగిన కీలక రోల్ చేసింది. దయ సీజన్ 2 కూడా ఉంది. మరోసారి విష్ణుప్రియ సందడి చేయనుంది. ఇదిలా ఉంటే విష్ణుప్రియ సడన్ గా తన చెల్లిని పరిచయం చేసింది.

తల్లి వర్ధంతి సందర్భంగా వీరు కలిశారు. తన చెల్లిని ఫ్యాన్స్ కి పరిచయం చేస్తూ కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసింది. విష్ణుప్రియ చెల్లి పేరు పావని అట. విష్ణుప్రియ ఆమెను ఇంటి నుండి గెంటేసిందట. అమ్మ వర్ధంతి కావడంతో తిరిగి ఇంటికి వచ్చిన పావని… అక్కకు డైమండ్ నెక్లెస్ గిఫ్ట్ గా ఇచ్చేందుకు షాపింగ్ కి తీసుకెళ్లింది. డైమండ్ నెక్లెస్,ఇయర్ రింగ్స్ బహుమతిగా ఇచ్చింది. ఎప్పటి నుండో ఇలాంటి నెక్లెస్ ఒకటి కొనాలి అనుకుంటున్నట్లు విష్ణుప్రియ అన్నారు. ఆ నెక్లెస్ తనకు ఎంతగానో నచ్చినట్లు వెల్లడించింది.

అయితే పావనిని విష్ణుప్రియ ఎందుకు ఇంటి నుండి పంపేసిందో తెలియాలంటే పూర్తి వీడియో చూడాలి. ఇక విష్ణుప్రియ చెల్లి కూడా అందం, ఒద్దుపొడుగులో అక్కకు ఏమాత్రం తక్కువ కాదు. విష్ణుప్రియ తల్లి గత ఏడాది కన్నుమూశారు. ఆమె మొదటి వర్ధంతి సందర్భంగా అక్కాచెల్లెళ్లు కలిశారు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker