ఫిబ్రవరి 3 నుంచి మహిళలకు అదిరిపోయే శుభవార్త, ఎలానో తెలుసుకోండి.
మూడు రాజధానులపై మరోసారి స్పష్టత ఇచ్చారు ఏపీ సీఎం వైఎస్ జగన్. ప్రముఖ వ్యాపారవేత్తలు, వేలాది మంది అతిధుల మధ్య ఎగ్జిక్యూటివ్ కేపిటల్ నగరంగా విశాఖ ఉంటుందని స్పష్టమైన ప్రకటన చేశారు. గతంలో ఢిల్లీ వేదికగా చేసిన వ్యాఖ్యలే మరోసారి సాగరతీరం సాక్షిగా చెప్పారు. అయితే గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా అంగడి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇందులో కేవలం మహిళా వ్యాపారులకు మాత్రమే ప్రత్యేకించి కౌంటర్లు ఇస్తుంటారు. ఇందులో ప్రధానంగా గ్రామీణం నుంచి గిరిజన ప్రజల వరకూ అందరూ పాల్గొనవచ్చు.
అయితే వారు కేవలం మహిళా వ్యాపారవేత్తలు.. ఔత్సాహికులు అయి ఉండాలనేది నిబంధన. ఏపీలోని విశాఖలో మరో ప్రత్యేక కార్యక్రమం రెడీ అవుతోంది. ఈ నెల అంటే ఫిబ్రవరి మూడు నుంచి రెండు రోజుల పాటు అంగడి 2 కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఫిబ్రవరి మూడు శనివారం, ఫిబ్రవరి నాలుగు ఆదివారం రెండు రోజులు తమ వ్యాపార వస్తువుల్ని ఇక్కడ ప్రదర్శించుకోవచ్చు. గ్రామీణ, గిరిజన మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడానికి ఏపి ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ ఉమెన్స్ వింగ్ 2024 ఈ అంగడి నిర్వహిస్తోంది.
ఫిబ్రవరి 3, 4 తేదీలలో విశాఖ దస్పల్లా హోటల్‌లోని దర్శిని, సందర్శిని హాల్‌లో ఇవి ఉంటాయి. ఈ రెండు రోజుల మహిళా పారిశ్రామికవేత్తల ఎక్స్‌పో అంగడి-2 ని నిర్వహిస్తోన్న నిర్వహాకురాలు యార్లగడ్డ గీతా శ్రీకాంత్ ఈ మేరకు వివరాలు తెలిపారు. రెండు రోజుల పాటు జరిగే ఈ ఎక్స్‌పోలో వివిధ రంగాల్లోని మహిళా పారిశ్రామికవేత్తల ఉత్పత్తులు, సేవలను ప్రదర్శించనున్నారు. ఎక్స్‌పోలో ఆర్ట్ ఉత్పత్తులు, సబ్బులు, పెర్ఫ్యూమ్‌లు, ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ, ఖాదీ చీరలు, పెయింటింగ్‌లు, రెసిన్ ఆర్ట్ , జ్యూట్ ఉత్పత్తులు, ఆర్గానిక్ ఉత్పత్తులు కోల్డ్ ప్రెస్‌డ్ ఆయిల్స్,
చిరుధాన్యాల ఉత్పత్తులు మొదలైన హస్తకళా ఉత్పత్తులు అన్నింటిని అనుమతించి ప్రదర్శనకు ఏర్పాటు చేశారు. అక్కడే శ్రేణిని ప్రదర్శించే 60 కంటే ఎక్కువ స్టాల్స్ ఉంటాయి. వీటిలో విక్రయాలు కూడా జరుపుకోవచ్చు. ఇక మరిన్ని వివరాల కోసం, స్టాల్ల్స్ కోసం కె. నాగేశ్వరరావు 9121221477 సంప్రదించాలని గీతా శ్రీకాంత్ కోరారు. మహిళా ఎంట్రిప్రీనర్స్ కోసం చేస్తోన్న కార్యక్రమాన్ని అందరూ ఆదరించాలని ఆమె కోరారు.