Vishwak Sen: ఫిష్ వెంకట్ దీన స్థితి చూసి ఆర్ధిక సాయం చేసిన హీరో విశ్వక్ సేన్. ఎంతో తెలుసా.?

Vishwak Sen: ఫిష్ వెంకట్ దీన స్థితి చూసి ఆర్ధిక సాయం చేసిన హీరో విశ్వక్ సేన్. ఎంతో తెలుసా.?
ఫిష్ వెంకట్..హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి సోమవారం ఆసుపత్రికి వెళ్లి ఆయన్ను పరామర్శించారు. ఐసీయూలో చికిత్స పొందుతున్న వెంకట్ ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు.

అయితే వెంకట్ ఆరోగ్య పరిస్థితిపై స్పందించిన యువ హీరో విశ్వక్ సేన్ మంచి మనసు చాటుకున్నారు. ఆయన రూ.2 లక్షల చెక్కును వెంకట్ కుటుంబానికి అందజేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Also Read: శివుడు ఆలయాన్ని నిర్మించి భక్తులైన బ్రిటిష్ దంపతులు.
విశ్వక్ చేసిన సాయం పట్ల పలువురు సినీ ప్రముఖులతో పాటు అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.ఇక వెంకట్ ఆపరేషన్‌కి కావల్సినంత మనీని ప్రభాస్ ఏర్పాటు చేస్తాడని అనేక వార్తలు వచ్చాయి.. కానీ ఈ వార్తల్లో నిజం లేదని, వెంకట్ భార్య సువర్ణ , కుమార్తె స్రవంతి స్పష్టం చేశారు.
Also Read: మళ్లీ వేణు స్వామితో పూజలు చేయించుకున్న నిధి.
ఎవరో “ప్రభాస్ మేనేజర్” పేరుతో ఫోన్ చేసి తమని తప్పుదారి పట్టించారని చెప్పారు. అయితే ప్రభాస్‌కు ఈ విషయం నిజంగా తెలియకపోవచ్చు, తెలిస్తే ఆయన ఖచ్చితంగా సహాయం చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.