Health

మీకు తెల్ల జుట్టుకు రంగు వేయాల్సిన పనిలేదు, వీటిని తింటే చాలు నల్లగా మారుతుంది.

మారిన జీవన శైలి , ఆహారపు అలవాట్ల కారణంగా చాలా మంది ఈ తెల్లజుట్టు సమస్యను ఎదుర్కొంటున్నారు. దీనికి తోడుగా జుట్టు రాలిపోయి బట్టతల సమస్యకూడా వేధిస్తుంది. అంతేకాకుండా తలస్నానం కోసం ఉపయోగించి వివిధ రకాల రసాయనాలతో తయారైన షాంపుల కారణంగా కూడా నల్ల జుట్టు కాస్తా తెల్లగా మారిపోతుంది. అయితే ఈ రోజుల్లో చిన్న వయసులోనే తెల్ల వెంట్రుకలు రావడం సర్వ సాధారణంగా మారింది. చాలా మందిని వేధిస్తున్న సమస్య ఇది. వయసు పైబడి, వృద్ధాప్యం ప్రారంభం కాకముందే వెంట్రుకలు తెల్లబడటంతో కొందరు అభద్రతా భావానికి లోనవుతున్నారు. అయితే వెంట్రుకలు రంగు మారడానికి ఎన్నో కారణాలు ఉన్నాయని డెర్మటాలజిస్టులు చెబుతున్నారు.

అనారోగ్యకరమైన జీవన శైలి, కాలుష్యం, మద్యపానం, ధూమపానం, ఒత్తిడి, పోషకాహార లోపం, విటమిన్ B12 లోపం, విటమిన్ D3 లోపం, ఐరన్ లోపం కారణంగా వెంట్రుకల్లో త్వరగా మార్పు కలుగుతుంది. కొన్ని పదార్థాలను ఆహారంలో చేర్చుకుంటే ఈ సమస్య నుంచి బయట పడొచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఉసిరి.. ఉసిరి ఎన్నో రకాలుగా శరీరానికి మంచి చేస్తుంది. ఇందులో పుష్కలమైన పోషకాలు ఉంటాయి. విటమిన్ సి, జింక్, మెగ్నీషియం, సెలేనియం, తదితర పోషకాలు జుట్టును ఆరోగ్యంగా ఉంచడానికి సహాయ పడతాయి. గ్రేయింగ్ సమస్యలను ఉసిరి అడ్డుకుంటుంది.

రోజూ క్రమం తప్పకుండా ఉసిరిని తింటే మెరుగైన ఫలితాలు పొందవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. బార్లీ గ్రాస్ జ్యూస్.. వెంట్రుకలు ఆరోగ్యంగా ఉండాలంటే తగిన పోషకాలు అందాలి. జుట్టు పెరగటానికి గోధుమ గ్రాసం లేదా బార్లీ గ్రాస్ జ్యూస్‌ని తీసుకుంటే మంచిది. వెంట్రుకల ఆరోగ్యానికి కావాల్సిన పోషకాలన్నీ ఇందులో ఉంటాయి. కాలేయాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో బార్లీ సహాయ పడుతుందన్న విషయం తెలిసిందే. గోధుమ గ్రాసంలోనూ వెంట్రుకలను పెంచే పోషకాలు ఉంటాయి. క్యాటలేస్ పదార్థాలు.. జుట్టు ఆరోగ్యానికి క్యాటలేస్ అనే పోషకం కలిగిన ఆహార పదార్థాలు తీసుకోవాలి.

స్వీట్ పొటాటో, క్యారెట్, వెల్లుల్లి, బ్రొకోలి, తదితర వాటిల్లో ఈ క్యాటలేస్ పోషకం ఉంటుంది. వీటిని తీసుకుంటే వెంట్రుకలు తెల్లబడవు. దీంతో పాటు వీటిల్లో ఏదో ఒక పదార్థాన్ని రెగ్యులర్‌గా తింటే జట్టు రాలడం తగ్గుతుంది. హెయిర్ లాస్ సమస్య నుంచి బయట పడొచ్చు. నిగెల్లా విత్తనాలు.. వెంట్రుకలను నల్లగా ఉంచడానికి నిగెల్లా లేదా బ్లాక్ విత్తనాలు ఉపయోగపడతాయి. వెంట్రుకలు రంగు మారకుండా ఉండేందుకు రోజువారీ డైట్‌లో నిగెల్లా విత్తనాలను చేర్చుకోవాలి. ఇందులో ఉండే పోషకాలు వెంట్రుకలను ఆరోగ్యంగా ఉంచడానికి సహకరిస్తాయి.

నువ్వులు, బ్లాక్ బీన్స్, జీలకర్ర, చియా విత్తనాలు, నల్ల బెల్లం వంటి పదార్థాలను తీసుకోవాలి. ఇవి చేయొద్దు.. జుట్టు సంరక్షణకు తీసుకోవాల్సిన పదార్థాలతో పాటు ఏమేం తినకూడదనే విషయం కూడా తెలిసి ఉండాలి. జుట్టు ఎప్పుడూ నల్లగా ఉండాలని అనుకుంటే కొన్నింటిని దూరం పెట్టాలి. షుగర్ కంటెంట్‌ కలిగిన పదార్థాలకు స్వస్తి చెప్పాలి. జంక్ ఫుడ్‌ని తినకూడదు. డెయిరీ పదార్థాలను అతిగా తీసుకోవడం మంచిది కాదు. శుద్ధి చేసిన పిండి, నిల్వ ఉంచిన ఆహారం, ప్రాసెస్ చేసిన ఫుడ్ ఆరోగ్యానికి హాని చేస్తాయి. వెంట్రుకలకు కూడా ఇవి చేటు చేస్తాయి.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker