White Bedsheets: హోటళ్లలో తెల్లటి బెడ్‌షీట్లనే ఎందుకు వేస్తారో తెలుసా..! 99% మందికి ఇది తెలిసి ఉండదు.

White Bedsheets: హోటళ్లలో తెల్లటి బెడ్‌షీట్లనే ఎందుకు వేస్తారో తెలుసా.. 99% మందికి ఇది తెలిసి ఉండదు.
సాధారణంగా తెలుపు రంగును పరిశుభ్రతకు చిహ్నంగా భావిస్తారనే విషయం అందరికి తెలిసిందే. ఒక అతిథి హోటల్‌కు వచ్చినప్పుడు తెల్లటి పరుపులు, బెడ్‌షీట్లు, దిండ్లు చూసినప్పుడు, అతను పరిశుభ్రమైన వాతావరణాన్ని అనుభవిస్తాడు. తెల్లటి బెడ్‌షిట్, తెల్లటి దిండు కవర్లు కనిపించగానే మనిషి ఆలోచన విధానంలో మార్పు కనిపిస్తుంటుంది. అలాగే పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇచ్చేలా ఇలాంటివి ఏర్పాటు చేస్తారు.

అయితే హోటల్ గదుల్లోని బెడ్‌లపై తెల్లటి బెడ్‌షీట్లు వేస్తారు. దీనిని మనం సినిమాల్లో కూడా చూసే ఉంటాం. తెల్లటి బెడ్‌షీట్లను హోటల్ గదుల్లో వినియోగించడానికి ప్రధాన కారణం వాటిని శుభ్రం చేయడం ఎంతో సులభం. నిజానికి హోటళ్లలోని అన్ని గదులలోని బెడ్‌షీట్లను ఏకకాలంలో బ్లీచింగ్ చేస్తారు. వాటిని క్లోరిన్‌లో నానబెట్టబడతారు. అటువంటప్పుడు ఈ షీట్లు రంగులలో ఉంటే వాటి రంగు చాలా త్వరగా క్షీణిస్తుంది, అయితే తెలుపు రంగు బెడ్‌షీట్లలో ఇటువంటి సమస్య ఏర్పడదు.
Also Read: శివుడు ఆలయాన్ని నిర్మించి భక్తులైన బ్రిటిష్ దంపతులు..!
తెల్లటి బెడ్‌షీట్‌పై ఏర్పడిన మరకలు బ్లీచ్ సహాయంతో సులభంగా శుభ్రం అవుతాయి. మరోవైపు వేసవి, వర్షాకాలంలో తేమ కారణంగా బెడ్‌షీట్‌ల నుంచి తరచుగా దుర్వాసన వెలువడుతుంటుంది. బ్లీచ్, క్లోరిన్‌లు తెల్లటి బెడ్‌షీట్ల రంగును అలాగే నిలిపివుంచుతాయి. అందుకే చాలా హోటల్ రూమ్‌లలో తెల్లటి బెడ్‌షీట్‌లను మాత్రమే ఉపయోగిస్తుంటారు. కాగా తెలుపు రంగు విలాసవంతమైన జీవనశైలికి గుర్తుగా బావిస్తారు.
Also Read: డైరెక్టర్ రాజమౌళి ఇంట తీవ్ర విషాదం
అందుకే హోటల్‌లోని గదులకు విలాసవంతమైన లుక్ ఇచ్చేందుకు తెల్లని బెడ్‌షీట్ ఉపయోగిస్తారు. దీనికితోడు తక్కువ ధరకే వైట్ బెడ్‌షీట్లను కొనుగోలు చేసేందుకు అవకాశం ఉంటుంది. తెలుపు రంగును సానుకూల దృక్ఫధానికి, శాంతికి చిహ్నంగా భావిస్తారు. హోటల్ గదిలో ప్రశాంతంగా నిద్రించడానికి. హాయిగా కూర్చోడానికి తెలుపురంగు బెడ్ షీట్లు ఉపకరిస్తాయి. అంతేకాకుండా మనసును ప్రశాంతంగా, సంతోషంగా ఉంచడంలో తెలుపు రంగు ఎంతగానో సహాయపడుతుంది.
Also Read: : తాడు అనుకున్నారా..! తాడు అనుకున్నారా..!
హోటళ్లలో తెల్లటి బెడ్‌షీట్లు వేసే ప్రక్రియ 1990ల తర్వాత మొదలైంది. 1990కి ముందు రంగుల బెడ్‌షీట్‌లను ఉపయోగించేవారు. అయితే 1990 తర్వాత, పాశ్చాత్య హోటల్ డిజైనర్లు గదికి విలాసవంతమైన లుక్ అందించడానికి, వినియోగదారులకు సౌకర్యవంతమైన అనుభూతిని అందించడానికి తెల్లటి బెడ్‌షీట్‌లను ఉపయోగించడం ప్రారంభించారు.