ఆడవాళ్లకు దీని రహస్యం తెలిస్తే అస్సలు వదిలిపెట్టారు. రాత్రి సమయంలో..?

కిడ్నీ, మూత్రనాళ సంబంధిత సమస్యలకు మెంతులు చక్కని మందు. రక్తనాళాలను, శ్వాస వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో వీటికివే సాటి. అందుకని మెంతికూర రోజూ మన ఆహారంతో పాటు తీసుకుంటే, మన ఆరోగ్యానికి తిరుగులేదు. కడుపు, కడుపులోని పేగులను మెంతులు శుద్ధి చేస్తాయి. అయితే మనం ఉదయం నిద్ర లేవగానే మంచినీళ్లు తాగుతాం. దీంతో మన జీర్ణక్రియ మెరుగుపడుతుంది. మనం తీసుకున్న ఆహారం సరిగా జీర్ణం కావాలంటే మంచినీరు సాయపడుతుంది. పోషకాలు, విటమిన్లు, ఖనిజాలు ఉండే వాటిని తీసుకోవడం వల్ల మనకు మేలు కలుగుతుంది.
పరగడుపున నీళ్లు తాగితే ఎన్నో రకాల సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. కానీ మంచినీరు కంటే మెంతులు తీసుకుంటే ఇంకా ఎక్కువ లాభాలు ఉంటాయి. రాత్రి సమయంలో నానబెట్టిన మెంతులు నీళ్లు తాగడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ముడిపడి ఉన్నాయి. మెంతులు రాత్రి నానబెట్టి ఉదయం సమయంలో వాటిని తిని ఆ నీరు తాగితే ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనం. ఆరోగ్య ప్రయోజనాలు కాపాడుకోవడానికి ఇది ఓ ఔషధంలా పనిచేస్తుంది. ఇందులో ఉండే ఫోలిక్ యాసిడ్, రిబోప్లావిన్, కాపర్, పొటాషియం, కాల్షియం, ఐరన్, మాంగనీసు, విటమిన్, ఎ, బి6, సి, కె పోషకాలు మనకు ఎంతో మేలు చేస్తాయి.
ఇది బరువు తగ్గేలా చేస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. బరువు తగ్గేందుకు సహకరిస్తుంది. ప్రతి రోజు ఉదయం ఖాళీ కడుపుతో మెంతి గింజలు తినడం వల్ల జీర్ణక్రియ బాగుపడుతుంది. అధిక బరువును కంట్రోల్ చేస్తుంది. ఆకలిని నియంత్రిస్తుంది. ఎక్కువ కేలరీల శక్తిని ఖర్చు చేయడానికి ఇది తోడ్పడుతుంది. మెంతి గింజలు తినడం వల్ల కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది. కొవ్వును కరిగిస్తుంది. పరగడుపున మెంతులను తినడం వల్ల మన రోగ నిరోధక వ్యవస్థ మెరుగుపడుతుంది. అనారోగ్య సమస్యలు దూరం కావడం తథ్యం.
అందుకే మధుమేహులకు మెంతులు మంచి ఆహారంగా ఉంటాయి. రక్తంలో షుగర్ లెవల్స్ తగ్గించడంలో మెంతులకు సాటి ఏవీ లేదని పరిశోధనలు నిరూపించాయి. చక్కెర ఉన్న వారు మెంతులు తీసుకుని తమ షుగర్ లెవల్స్ తగ్గించుకోవచ్చు. మెంతులతో ఇంకా అనేక రకాల లాభాలు ఉన్న సంగతి చాలా మందికి తెలియదు. ఆయుర్వేదంలో మెంతులకు మంచి స్థానం ఉంటుంది. రోజు గుప్పెడు మెంతులు రాత్రి సమయంలో ఒక గ్లాసులో నానబెట్టి ఉదయం సమయంలో ఆ నీళ్లను తాగి మెంతులు తినడం ఆరోగ్యానికి సురక్షితమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
మెంతుల వల్ల కలిగే లాభాల గురించి తెలియడంతో ఆడవారు వీటిని విరివిగా వాడేందుకు ఇష్టపడతారు. మన వంటింట్లో ఉండే వాటితోనే మన ఆరోగ్యం ముడి పడి ఉంది. దీంతో మెంతులు రోజు తినడం వల్ల ఆరోగ్యం చేకూరుతుందని తెలుసుకున్నాం కదా. అందుకే మెంతులను ఉదయం పూట పరగడుపున తినడం ఎంతో సురక్షితం.