Health

అలెర్ట్, బరువు ఎక్కువున్న ఆడవారికే ఆ సమస్య వస్తుందా..?

పనుల్లో పడి మహిళలు భోజనం మానేయడం వంటివి చేయడం వల్ల పోషకాల లోపం ఏర్పడుతుంది. ఫలితంగా ఆకలిగా అనిపించడం, శక్తి తక్కువగా ఉంటుంది. ఏకాగ్రతతో రోజంతా పని చేయడం కష్టంగా మారుతుంది. మహిళలు మల్టీ టాస్క్ చేస్తూ ఉంటారు. అందుకే వారికి సమతుల్య, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం చాలా అవసరం. అయితే స్థూలకాయంతో బాధపడుతున్న ఆడవారు పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. బరువు పెరగడం వల్ల సన్నిహిత ప్రాంతంలో ముఖ్యంగా తొడలలో కొవ్వు ఎక్కువగా పేరుకుపోతుంది. దీని వల్ల ఆ ప్రాంతానికి సరిగా గాలి వెళ్లదు. అంతేకాదు అక్కడ విపరీతమైన చెమటలు పడుతుంటాయి. గాలి లేకపోవడం వల్ల యోనిపై, యోని చుట్టూ ఉన్న చర్మంపై చెమట పేరుకుపోతుంది. దీనివల్ల దద్దుర్లు, గడ్డలు, దురద వంటి సమస్యలు వస్తాయి.

అలాగే బరువు ఎక్కువగా ఉన్న మహిళలకు యూటీఐ సంక్రమణ, ఇతర యోని ఇన్ఫెక్షన్ల ప్రమాదం కూడా ఉంది. బరువు తగ్గడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. డయాబెటిస్, గుండె జబ్బుల ముప్పు తగ్గుతుంది. యోని ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం కూడా ఉండదు. బరువెక్కువున్న మహిళలు పీరియడ్స్, మెనోపాజ్, తేమతో కూడిన వాతావరణంలో అంటువ్యాధులకు ఎక్కువగా గురవుతున్నారని గణాంకాలు చెబుతున్నాయి. కాటన్ దుస్తులు ధరించండి.. బరువెక్కువున్న మహిళలు తమ శరీర పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఎందుకంటే వీరి సన్నిహిత ప్రాంతంలో చెమట ఎక్కువగా పడుతుంది. ఇది సంక్రమణ ప్రమాదాన్ని పెంచుతుంది. అందుకే వదులుగా ఉండే దుస్తులనే వేసుకోవాలి. దీంతో గాలి యోనికి బాగా చేరుతుంది.

వీటితో పాటుగా తేలికపాటి కాటన్ ప్యాంట్లు కూడా ధరించాలి. ఇలా చేయడం వల్ల యోని చర్మంపై క్రిములు పెరగకుండా, ఎండాకాలంలో యోని ఇన్ఫెక్షన్ వంటి సమస్యలు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. ప్రైవేట్ ప్రాంతంలో జుట్టు.. ప్రైవేట్ ప్రాంతంలో జుట్టు పెరగకుండా జాగ్రత్త పడాలి. ఈ హెయిర్ ను మైనం లేదా హెయిర్ రిమూవల్ క్రీమ్ తో తొలగిండం మానుకోండి. నిపుణుల ప్రకారం.. ఈ పద్ధతులు చాలా ప్రమాదకరం. వీటి వల్ల యోనిలో దద్దుర్లు, ఇతర రకాల ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. అయితే ఈ జుట్టును పూర్తిగా తొలగించడం కూడా సురక్షితం కాదు. వీటిని పూర్తిగా తొలగిస్తే సంక్రమణ ప్రమాదం పెరుగుతుంది. ఇది బ్యాక్టీరియా, ఇతర సూక్ష్మక్రిములను మీ యోనిలోకి ప్రవేశించడానికి అనుమతిస్తుంది.

ఈ జుట్టును తొలగించాలనుకుంటే ట్రిమ్మింగ్ దీనికి మంచి ఎంపిక. ప్రైవేట్ భాగంలోని జుట్టును ట్రిమ్మర్ తో తీసేయండి. పరిశుభ్రత ఉత్పత్తులను ఉపయోగించండి. గైనకాలజిస్టుల ప్రకారం.. సన్నిహిత ప్రాంతాన్ని శుభ్రం చేయడానికి ఎస్ఎల్ఎస్ లేని ఉత్పత్తులను ఉపయోగించాలి. సబ్బు, ఇతర బాడీ వాష్ లు వంటి ఎస్ఎల్ఎస్ కలిగిన ఉత్పత్తులు యోని పిహెచ్ స్థాయిని ప్రభావితం చేస్తాయి. ఇది సంక్రమణ ప్రమాదాన్ని పెంచుతుంది. మీకు యోని ఇన్ఫెక్షన్ ఉంటే, అందులోనూ అది చాలా కాలం పాటు కొనసాగితే వీలైనంత తొందరగా హాస్పటల్ కు వెళ్లండి. ఎండాకాలంలో యోని ఇన్ఫెక్షన్లు త్వరగా నయం కావు. ముఖ్యంగా మీరు ఓవర్ వెయిట్ ఉంటే.

ఇది పెద్ద సమస్యగా మారుతుంది. యోనిని, ప్యాంటీని పొడిగా ఉంచండి.. ప్రతిసారీ బాత్రూమ్ కు వెళ్లొచ్చిన తర్వాత మీ యోనిని, లోదుస్తులను పూర్తిగా ఆరబెట్టడం చాలా ముఖ్యం. దీని కోసం మూత్ర విసర్జన చేసిన ప్రతిసారీ మీ యోనిని టిష్యూ పేపర్ తో తుడిచి బాగా ఆరబెట్టండి. చెమట కారణంగా ప్యాంటీ తడిసిపోతే మీరు ప్యాంటీలైనర్, చెమట ప్యాడ్ ను ఉపయోగించొచ్చు. ఇది యోని బ్యాక్టీరియా, ఫంగస్ లేకుండా ఉండటానికి, సంక్రమణ నుంచి రక్షించడానికి సహాయపడుతుంది. చెకప్ లు అవసరం. నిపుణుల ప్రకారం.. మీరు ఎక్కువ బరువున్నా లేకపోయినా.. ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా యోని పరీక్షలు చేయించుకోవాలి. మీ యోని ఉత్సర్గలో మార్పు ఉన్నా, మీ ఉత్సర్గ చెడు వాసన ఉన్నా ఇది సంక్రమణను సంకేతం. కాబట్టి వీటిని నిర్లక్ష్యం చేయకండి. ఈ విషయాలను డాక్టర్ తో చెప్పండి.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker