మహిళలకు థైరాయిడ్ సమస్య ఉంటే పిల్లలు పుట్టరా..? అసలు విషయమేంటంటే..?

స్త్రీల విషయంలో అయితే ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. వివాహమైన తర్వాత పిల్లలు పుట్టకుంటే అందుకు కారణాలు కూడా ఉంటాయి. ఇక చాలా మంది స్త్రీలలో థైరాయిడ్ ఉంటుంది. థైరాయిడ్ అనేది శరీరంలో జీవక్రియను నియంత్రిస్తుంది. మిగతా గ్రంథులు సక్రమంగా పనిచేయడానికి థైరాయిడ్ అనే ఎండోక్రైన్ చాలా అవసరం. అయితే మహిళల్లో థైరాయిడ్ సమస్య చాలా కామన్. 25 ఏళ్లకు పైబడిన మహిళల్లో ప్రత్యేకించి ఈ థైరాయిడ్ సమస్య కనిపిస్తుంటుంది.
పురుషులతో పోలిస్తే.. మహిళల్లో థైరాయిడ్ డిజార్డర్ సమస్య మూడు రెట్లు అధికంగా ఉంటుందని ఓ పరిశోధనలో తేలింది. మహిళల్లో థైరాయిడ్ సమస్య చాలా కామన్. 25 ఏళ్లకు పైబడిన మహిళల్లో ప్రత్యేకించి ఈ థైరాయిడ్ సమస్య కనిపిస్తుంటుంది. పురుషులతో పోలిస్తే.. మహిళల్లో థైరాయిడ్ డిజార్డర్ సమస్య మూడు రెట్లు అధికంగా ఉంటుందని ఓ పరిశోధనలో తేలింది. ఈ పరిశోధన ప్రకారం.. ఇండియాలో 20 శాతం మహిళలు థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నారు.

థైరాయిడ్ సమస్య కారణంగా ఆరోగ్యపరంగా ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు. థైరాయిడ్ బారిన పడిన మహిళల్లో వంధ్యత్వం (సంతానం కలగకపోవడం) ముప్పు కూడా ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. థైరాయిడ్ అనగానే.. మెడ భాగంలో సీతాకోకచిలుక ఆకారంలో ఉండే ఓ చిన్న గ్రంథి. మనిషి శరీరంలోని శక్తిని వినియోగించుకునేందుకు ఈ థైరాయిడ్ గ్రంథి హార్మోన్లను ఉత్పత్తి చేయడంలో సహకరిస్తుంది. కొన్ని సార్లు థైరాయిడ్ హర్మోన్లు స్రవించాల్సిన స్థాయిలో కంటే ఎక్కువగా స్రవిస్తుంటుంది. దీన్నే హైపోథైరాడిజమ్ అంటారు. దీని కారణంగా శరీరంలో మార్పులు వేగంగా సంభవిస్తాయి.

హైపోథైరాడిజమ్, థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్న మహిళలు గర్భం దాల్చలేరు. థైరాయిడ్ హార్మోన్ల స్థాయి తక్కువగా ఉంటే.. వంధ్యత్వానికి (సంతాన ప్రాప్తి కోల్పోవడం) దారితీస్తుందని చెబుతున్నారు. ఒకసారి థైరాయిడ్ వ్యాధి వస్తే.. అంత తొందరగా క్యూర్ కాదని.. క్రమంగా వంధ్యత్వానికి దారి తీస్తుందని, లేదంటే గర్భం దాల్చినప్పుడుల్లా తరచూ మిస్ క్యారెజ్ (గర్భస్రావం) జరుగుతుంటుందని పరిశోధకులు తెలిపారు. వంధ్యత్వం లక్షణాలతో నెలవారీ నెలసరి కూడా క్రమం తప్పుతుందని మెడికల్ డైరెక్టర్, ఐవీఎఫ్ శోభా గుప్తా తెలపారు.

నెలసరి తప్పడంతో శరీరంలో ఉష్ణోగ్రత స్థాయి ఒక్కసారిగా పెరిగిపోయి గర్భం దాల్చే అవకాశాలు చాలా కష్టంగా మారుతుందని చెప్పారు. థైరాయిడ్ ప్రారంభ దశలో ఆరోగ్యకరమైన జీవనశైలి, బరువు తగ్గడం, కంటినిండా నిద్రపోవడం, ఒత్తిడిని తగ్గించుకోవడం, ప్రతిరోజు వ్యాయామం చేస్తుండాలి. సరైన డైట్ తీసుకోవడంతో థైరాయిడ్ ను కొంతమేరకు అయిన అదుపులో ఉంచేందుకు దోహదపడతాయని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.