Health

రోజు ఇలా వర్క్ చేసేవారికి హార్ట్ అటాక్ రావడం ఖాయం, సంచలన విషయం చెప్పిన కార్డియాలజిస్ట్ డాక్టర్.

గుండె కండరాలలోని కొన్ని భాగాలకు తగినంత రక్తం లభించనప్పుడు గుండెపోటు వస్తుంది. దీనికి సకాలంలో చికిత్స చేసి గుండెకు రక్త ప్రవాహాన్ని పునరుద్ధరించాలి. ఆలస్యం అవుతున్నా కొద్దీ గుండె కండరాలకు ఎక్కువ నష్టం జరుగుతుంది. గుండెపోటుకు ప్రధాన కారణం కొరోనరీ ఆర్టరీ వ్యాధి. గుండె కండరాలకు ఆక్సిజన్ ఉండే రక్తం వెళ్లే మార్గం ఒక్కసారిగా సంకోచించడం వల్ల గుండెపోటు రావచ్చు. అయితే బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో పనిచేస్తున్న కార్డియాలజిస్ట్ డాక్టర్ దీపక్ కృష్ణమూర్తి ఈ అంశంపై ఎక్స్ లో సొంత అభిప్రాయాలను వెల్లడించారు.

ఇలా ఎక్కువ గంటలు పనిచేయడం వల్ల మనిషి జీవితం, ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుందని అన్నారు. ఒత్తిడి, శారీరక శ్రమ లేకపోవడం వల్ల ఇప్పటికే చాలా మంది యువత గుండెపోటుకు గురవుతున్నారని ఆయన గుర్తు చేశారు. వారానికి 70 గంటలు పని చేస్తే పరిస్థితి మరింత దిగజారుతుందని హెచ్చరించారు. రోజుకు 12 గంటలు, వారానికి ఆరు రోజులు పని చేయడం వల్ల జీవితంలోని ఇతర అంశాలకు చాలా తక్కువ సమయం ఎలా మిగిలిపోతుందో కూడా డాక్టర్ దీపక్ వివరించారు.

నారాయణమూర్తి చెప్పినట్లు వర్క్ చేస్తే రోజులోని 24 గంటలలో ఉద్యోగులకు పని తర్వాత 12 గంటలు మాత్రమే మిగిలి ఉంటుందని అన్నారు. ఆ 12 గంటలలో ఎనిమిది గంటలు నిద్ర అవసరమవుతుందని చెప్పారు. ఇలా చూసుకుంటే ఇతర ముఖ్యమైన పనులకు నాలుగు గంటలు మాత్రమే మిగిలి ఉంటుందని పేర్కొన్నారు. ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉన్న బెంగళూరు లాంటి నగరంలో ఉద్యోగులు రోజూ రెండు గంటలపాటు రోడ్డుపైనే గడుపుతారని అన్నారు. ఆ రెండు గంటలు పోనూ వ్యక్తిగత పరిశుభ్రత, భోజనం, ప్రాథమిక పనులకు కేవలం రెండు గంటల సమయం మాత్రమే మిగులుతుందని స్పష్టం చేశారు.

దీని వల్ల సోషలైజింగ్, ఫ్యామిలీ ఇంట్రాక్షన్స్, వ్యాయామం లేదా విశ్రాంతి తీసుకోవడానికి నిమిషం కూడా సమయం ఉండదని స్పష్టంగా తెలిపారు. చాలా కంపెనీలు ఉద్యోగులు వర్కింగ్ అవర్స్ తర్వాత కూడా ఈ-మెయిల్స్‌, కాల్స్‌కు అందుబాటులో ఉంటారని ఆశిస్తున్నట్లు ఆయన చెప్పారు. పోస్ట్ కింద కామెంట్ సెక్షన్‌లో యువతకు మరిన్ని ఉద్యోగావకాశాలు కల్పించాలని, వారు ఆరోగ్యవంతమైన, సంతోషకరమైన జీవనశైలిని కలిగి ఉండేలా చూడాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.

డాక్టర్ కృష్ణమూర్తి పోస్ట్ సరైన వర్క్-లైఫ్ బ్యాలెన్స్ లేకుండా ఎక్కువ గంటలు పనిచేయడం వల్ల కలిగే సవాళ్లు, నష్టాలను క్లియర్‌గా తెలియజేసింది. మరోవైపు భారతదేశ ఐటీ పరిశ్రమలో పేరున్న నారాయణమూర్తి ప్రకటనకు JSW ఛైర్మన్ సజ్జన్ జిందాల్ వంటి కొంతమంది వ్యాపార ప్రముఖులు మద్దతు ఇచ్చారు, కానీ అది బానిసత్వం, అమానవీయం అవుతుందని అనేక మంది విమర్శించారు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker