Health

పెళ్లైందా..? పిల్లల కోసం ట్రై చేస్తున్నారా..? మీ కోసమే ఈ ముఖ్యమైన విషయం.

కొవిడ్ బారినప‌డి కోలుకున్న వారు ఖచ్చితంగా ఫ్యామిలీ ప్లానింగ్ పాటించాల్సిందేన‌ని చెబుతున్నారు వైద్యులు. ఆరోగ్య‌వంతులు అయిన త‌ర్వాత మూడు నెల‌ల వ‌ర‌కు పిల్ల‌ల‌ను క‌నే ఆలోచ‌న విర‌మించుకోవాల‌ని సూచిస్తున్నారు. క‌రోనా కార‌ణంగా సంతాన సాఫ‌ల్య‌త‌పై ప్ర‌భావం ప‌డుతుంద‌ని అంటున్నారు. అయితే ఇటీవల కాలంలో చాలా జంటలు పెళ్లి తర్వాత పిల్లలు పుట్టక ఆందోళన చెందుతున్నారు. ఇందుకు ఎన్నో కారణాలు ఉండవచ్చు. పోషకాహారం తీసుకోకపోవడం, శారీరక శ్రమ తగ్గడం, జన్యుపరమైన కారణాలు, కొన్ని రకాల అనారోగ్యాలు సంతాన సాఫల్య రేటును తగ్గిస్తున్నాయి.

అయితే ఇతర కారణాలను మినహాయిస్తే.. కొన్ని అలవాట్లు మగవాళ్ల సంతానోత్పత్తి సామర్థ్యాన్ని, వీర్యం ఆరోగ్యాన్ని దెబ్బతీయగలవని అధ్యయనాలు చెబుతున్నాయి. స్పెర్మ్ క్వాలిటీ, కౌంట్‌ను జీవనశైలి కారకాలు ప్రభావితం చేయలగవు. ఆల్కహాల్.. అతిగా ఆల్కహాల్ తీసుకునే అలవాటు స్పెర్మ్ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. ఆల్కహాల్ కారణంగా స్మెర్మ్ కౌంట్, స్పెర్మ్ చలనశీలత రెండూ తగ్గుతాయి. పిల్లల కోసం ట్రైచేసే జంటలు మద్యపానాన్ని పరిమితం చేయడం లేదా పూర్తిగా మానేయడం మంచిది. స్మోకింగ్..స్మోగింగ్ అలవాటు ఎన్నో రకాల వ్యాధులకు మూల కారణం. రీప్రొడక్టివ్ హెల్త్‌పై కూడా పొగాకు వాడకం నెగిటివ్ ఇంపాక్ట్ చూపుతుది.

సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తుల్లో 2,000 కంటే ఎక్కువ రసాయనాలను ఉంటాయి. వీటిలో అత్యంత హానికరమైనది నికోటిన్. ఈ కెమికల్ కాంపౌండ్స్ కారణంగా స్మోకింగ్ చేసేవారి స్పెర్మ్ కదలికలు తగ్గుతాయి. ఫలితంగా శుక్ర కణాలు అండాన్ని చేరుకోలేవు. ఇది గర్భధారణ అవకాశాలను తగ్గిస్తుంది. అలాగే పొగతాగే అలవాటు స్పెర్మ్‌లోని DNAకి సైతం హాని కలిగిస్తుంది. దీంతో అండం ఫలదీకరణ చెందే రేటు తగ్గుతుంది. నిద్ర లేకపోవడం.. స్పెర్మ్ ఆరోగ్యానికి మంచి స్లీపింగ్ షెడ్యూల్ అవసరం. వేర్వేరు షిఫ్టుల్లో వర్క్ చేసేవారు, రాత్రివేళ నిద్ర పోకుండా పనిచేసే వారిని కొన్ని రకాల అనారోగ్యాలు వేధించవచ్చు.

ఎందుకంటే స్లీపింగ్ సైకిల్ సరిగా లేకపోతే శరీర సిర్కాడియన్ రిథమ్‌కు అంతరాయం కలుగుతుంది. తద్వారా ఇది స్పెర్మ్ క్వాలిటీ, క్వాంటిటీని ప్రభావితం చేస్తుంది. స్పెర్మ్ కదలికలు, నాణ్యతను మెరుగుపరచడానికి ప్రతి రాత్రి కనీసం ఏడు నుండి ఎనిమిది గంటల నిద్ర అవసరం. ఊబకాయం..అధిక బరువు లేదా ఊబకాయం ఉన్న వ్యక్తుల స్పెర్మ్ క్వాలిటీ, యాక్టివిటీ తగ్గవచ్చు. ఊబకాయం హార్మోన్ల అసమతుల్యతకు దారితీస్తుంది. ముఖ్యంగా ఈస్ట్రోజెన్, టెస్టోస్టెరాన్ నిష్పత్తి తగ్గవచ్చు. టెస్టోస్టెరాన్ స్థాయిలు తగ్గితే స్పెర్మ్ ఉత్పత్తి, నాణ్యతకు హాని కలిగిస్తుంది. అలాగే అధిక బరువు కారణంగా వృషణాల చుట్టూ అదనపు వేడి ఉత్పత్తి అవుతుంది. ఇవి స్క్రోటమ్‌లో ఉంటాయి. స్క్రోటల్ ఉష్ణోగ్రత పెరిగితే స్పెర్మ్ క్వాలిటీ, పరిమాణం రెండింటినీ తగ్గిస్తుంది.

ఆహారం.. మీరు తీసుకునే ఆహారం మీ స్పెర్మ్ ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ట్రాన్స్ ఫ్యాట్స్ అధికంగా ఉన్న ఆహారం, ప్యాకేజ్డ్, ప్రాసెస్డ్ ఫుడ్ నిరంతరం తీసుకునే వారి స్పెర్మ్ క్వాలిటీ తగ్గవచ్చు. కార్బోనేటేడ్, ఫిజీ డ్రింక్స్‌లో చక్కెర శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ల్యాప్‌టాప్స్, బిగుతు దుస్తులు..ల్యాప్‌టాప్స్‌ మీద పెట్టుకొని ఎక్కువ సమయం పని చేసేవారితో పాటు బిగుతుగా ఉండే ప్యాంటు లేదా లోదుస్తులను ధరించడం కూడా స్మెర్మ్ ఉత్పత్తికి ఆటంకంగా మారవచ్చు. ల్యాప్‌టాప్ ఒడిలో పెట్టుకొని వాడితే, హీట్ కారణంగా వృషణాలు అధిక వేడికి ప్రభావితమై స్పెర్మ్ ఆరోగ్యానికి హాని కలుగుతుంది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker