Health

రోజూ పరగడుపున గోమూత్రాన్ని కొంచం తాగితే ఎంత మంచిదో తెలుసుకోండి.

గోమూత్రం అనేది వివిధ రకాల ఆరోగ్య ప్రయోజనాలతో లభిస్తుంది. ఇది మధుమేహ నిర్వహణ, గాయాలను నయం చేయడం మరియు రోగనిరోధక వ్యవస్థను పటిష్టం చేయడం కోసం పరిపూర్ణ నివారిణిగా అనేక అద్భుతమైన లక్షణాలను కలిగి ఉంది. అయితే మనిషిని అనారోగ్యం పాలు చేస్తున్న అధిక బరువు, షుగర్ వ్యాధి, అల్సర్, గ్యాస్, మలబద్ధకాన్ని అరికట్టే ప్రకృతి ఆహారం క్రమబద్దంగా, నియమానుసారంగా పాటిస్తే మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంటుంది.

దేశీ నాచురల్స్ ఆర్గానిక్, నాచురల్ ప్రొడక్ట్స్ మనిషి ఆరోగ్యానికి చాలా మంచిదని సనాతన ధర్మం చెబుతుంది. హిందువులు పవిత్రంగా భావించే ఆవు మూత్రం ఆయుర్వేదిక్‌ గా ఎంతో మంచిది అంటూ ప్రయోగాల్లో కూడా వెళ్లడి అయ్యింది. వందల కొద్ది ఆయుర్వేదిక్‌ ఔషదాల్లో గో మూత్రంను ఉపయోగిస్తారు. విదేశాల్లో కూడా గో మూత్రంకు మంచి డిమాండ్‌ ఉంది. భారతదేశంలోని అనేక గ్రామాల్లో నేటికీ గోమూత్రాన్ని ఎందుకు చల్లుతారంటే దానిలో క్రిమిసంహారక రసాయనాలు ఉంటాయి.

అంతే కాదు ఆవు పేడ కూడా గోడలకు పూయడం వల్ల పరిసరాలు పరిశుభ్రంగా ఉండటమే కాదు, వ్యాధుల నివారణకు కూడా తోడ్పడుతుంది. చేదుగా, వెచ్చగా ఉండే గోమూత్రం వల్ల ఉదర సంబంధ సమస్యలు సమసిపోతాయి. ఇది వాత పిత్తాలను సమతౌల్యం చేస్తుంది. ఇందులో పొటాషియం, కాల్షియం, క్లోరైడ్, యూరియా, అమ్మోనియా, సల్ఫర్, యూరిక్ యాసిడ్, ఫాస్పేట్, మాంగనీస్, కార్బోలిక్ యాసిడ్, క్యాల్షియం లాంటి మూలకాలే కాదు విటిమిన్ ఎ, బి, డి ఈ కూడా ఉన్నట్లు ఆధునిక పరిశోధనలో గుర్తించారు.

కేవలం గ్యాస్టిక్ర్, ఎసిడిటీ సమస్యలనే కాదు చర్య వ్యాధులను కూడా గోమూత్రం దూరం చేస్తుంది. కేన్సర్, హిస్టీరియా, క్షయ లాంటి భయంకర వ్యాధులను కూడా నయం చేసే గుణాలు గోమూత్రంలో ఉన్నాయని ఇటీవల అధ్యయనంలో వెల్లడైంది. తీవ్రమైన వ్యాధుల నుంచి రక్షించే గుణం గోమూత్రంలో ఉంది.

ఆక్సీకరణం వల్ల శరీర కణాల్లోని దెబ్బతిన్న డీఎన్‌ఏను రక్షిస్తుంది. నరాల బలహీనతలను కూడా దూరం చేస్తుంది. అధిక రక్తపోటును కూడా నియంత్రించి గుండె పనితీరు మెరుగుపడేలా చేసే గుణం దీనికి ఉంది. అవు పాలు, పెరుగు, నెయ్యిలో అత్యధిక పోషకాలు ఉంటాయి. కాబట్టి పోషకాహార లోపంతో బాధపడే వ్యక్తులు వీటిని తీసుకుంటే ప్రయోజనం ఉంటుంది. నెయ్యి వల్ల శారీరక, మానసిక సామర్థ్యం వృద్ధి చెందుతుంది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker