కరోనా వచ్చి తగ్గిన వారి మెదడు ఎలా మారిపోతుందో తెలుసా..? కొన్ని రోజుల్లోనే..!

కరోనా వైరస్ మెదడుపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుందని తాజాగా ఓ అధ్యయనంలో వెల్లడయ్యింది. స్వల్ప కరోనా కేసుల్లోనూ మెదడు దెబ్బతిని, ఆలోచన విధానంలో మార్పులు వస్తాయని పరిశోధకులు గుర్తించింది. ఇన్‌ఫెక్షన్ సోకిన కొన్ని నెలల తర్వాత మెదడులో వాసన గ్రాహకాలు, సాధారణ వృద్ధాప్యంతో సమానమైన పరిమాణంలో సంకోచం సహా మెదడు దెబ్బతినడం వంటివి పరిశోధకులు గుర్తించారు. అయితే 50 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయసున్న వ్యక్తుల కాగ్నిటివ్ ఫంక్షన్స్‌పై కోవిడ్-19 మహమ్మారి ప్రభావం గురించి ఇటీవల అధ్యయనం ఆసక్తికర విషయాలు వెల్లడించింది.
ఈ పరిశోధన ది లాన్సెట్ హెల్తీ లాంగ్విటీలో పబ్లిష్ అయింది. UKలో 50 నుంచి 90 సంవత్సరాల వయసున్న 3,000 మందిపై కంప్యూటరైజ్డ్ బ్రెయిన్ ఫంక్షన్స్ టెస్ట్‌లు నిర్వహించారు. కోవిడ్-19 బారిన పడకపోయినా, మహమ్మారి మొదలైన మొదటి సంవత్సరంలో ఈ వయసు వ్యక్తుల కాగ్నిటివ్ ఫంక్షన్స్ మునుపటితో పోలిస్తే 50% వేగంగా తగ్గాయి. మహమ్మారికి ముందే కాగ్నిటివ్ ఫంక్షన్స్‌లో క్షీణత ఉన్నవారిపై ఇది మరింత ప్రభావం చూపింది. స్టడీలో ప్రధానంగా షార్ట్ టర్మ్ మెమరీ, సంక్లిష్టమైన పనులను పూర్తి చేయగల సామర్థ్యాన్ని అనలైజ్ చేయడంపై దృష్టి పెట్టారు.
ఫలితాలు మహమ్మారి మొదలైన మొదటి సంవత్సరంలో కాగ్నిటివ్ ఫంక్షన్స్ క్షీణతలో 50% పెరుగుదలను వెల్లడించాయి. ఈ క్షీణత రెండో సంవత్సరం వరకు కొనసాగింది. కారణాలు ఇవే.. మహమ్మారి సమయంలో అనేక అంశాలు ఈ కాగ్నిటివ్ ఫంక్షన్స్ క్షీణతకు దోహదపడ్డాయని భావిస్తున్నారు. వీటిలో ఒంటరితనం పెరగడం, నిరాశ, శారీరక శ్రమ తగ్గడం, అధిక మద్యపానం వంటివి ఉన్నాయి. అయితే మునుపటి పరిశోధనలో శారీరకంగా చురుకుగా ఉండటం, డిప్రెషన్‌ను తగ్గించుకోవడం, సోషలైజింగ్, ఇతరులతో మళ్లీ కనెక్ట్ అవ్వడం వంటివి చిత్తవైకల్యం(డిమెన్షియా) ప్రమాదాన్ని తగ్గించడంలో,
మెదడు ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో సహాయపడతాయని తేలింది. డిమెన్షియా దైనందిన జీవితంపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది. సాధారణ పనులు, కమ్యూనికేషన్, సొంత అవసరాలు తీర్చుకోవడాన్ని కూడా క్లిష్టతరం చేస్తుంది. ఎక్సెటర్ యూనివర్సిటీ డిమెన్షియా రీసెర్చ్, ప్రొఫెసర్ అన్నే కార్బెట్ మాట్లాడుతూ.. ఎర్లీ కాగ్నిటివ్ ఫంక్షన్స్ క్షీణతను ఎదుర్కొంటున్న వ్యక్తులకు మద్దతు ఇవ్వాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. డిమెన్షియా ప్రమాదాన్ని తగ్గించేందుకు చర్యలు తీసుకోవడం అవసరమని పేర్కొన్నారు.
జ్ఞాపకశక్తి సమస్యలు తలెత్తితే, వైద్యులను సంప్రదించాలని స్పష్టం చేశారు. భవిష్యత్తులో మహమ్మారి వంటి రెస్ట్రిక్షన్స్ అమలు చేసేటప్పుడు విస్తృతమైన ఆరోగ్య ప్రభావాలను పరిగణనలోకి తీసుకోవాల్సిన ప్రాముఖ్యతను కూడా అధ్యయనం ఫలితాలు హైలైట్ చేశాయి. డిమెన్షియా ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 50 మిలియన్ల మందిని ప్రభావితం చేసింది. 2050 నాటికి మూడు రెట్లు పెరుగుతుందని అంచనా. మానసిక పనితీరును సానుకూలంగా ప్రభావితం చేయడానికి జీవనశైలి మార్పులు, మెరుగైన ఆరోగ్య నిర్వహణ అవసరమని పరిశోధకులు వివరిస్తున్నారు.