News

ఇండస్ట్రీలో పెను విషాదం, గుండెపోటుతో యువ నటుడు మృతి.

కన్నడ యువ నటుడు నితిన్ గోపీ 39వ ఏటా మరణించారు. శుక్రవారం రాత్రి నితిన్ అకాల మరణం చెందారు. దీంతో శాండల్ వుడ్ లో విషాద ఛాయలు నెలకొన్నాయి. అయితే, నిన్న రాత్రి నితిన్ కు గుండుపోటు రావడంతో వెంటనే కుటుంబీకులు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందరుతూ పరిస్థితి విషమించి మరణించారు. నితిన్ అకాల మరణంతో కన్నడ చిత్ర పరిశ్రమలోని పలువురు ప్రముఖులు విచారం వ్యక్తం చేస్తున్నారు.

ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని నివాళి అర్పిస్తూ భగవంతుడిని ప్రార్థిస్తున్నారు. అయితే కన్నడ పవర్‌ స్టార్‌ పునీత్ రాజ్‌కుమార్‌ మొదలు ఫిబ్రవరిలో కన్నుమూసిన తారకరత్న వరకు గుండెపోటు బాధితులే. ఇప్పుడు మరో యువ నటుడు గుండెపోటుతో కుప్ప కూలారు. కన్నడ సినీ పరిశ్రమకు చెందిన నితిన్‌ గోపీ గుండెపోటుతో తుది శ్వాస విడిచారు. అతని వయసు కేవలం 30 సంవత్సరాలే కావడం గమనార్హం.

ఛైల్డ్‌ ఆర్టిస్టుగా వెండితెరకు పరిచయమైన నితిన్‌ గోపీ దిగ్గజ నటుడు డాక్టర్‌ విష్ణు వర్ధన్‌తో కలిసి హలో డాడీ అనే లో నటించాడు. ఇందులో విష్ణు వర్ధన్‌ కుమారుడి పాత్రలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ముత్తినంత హెంతి, కేరళిద కేసరి, నిశ్శబ్ధ, చిరబండవ్య వంటి ల్లో కూడా నితిన్‌ నటించారు. భక్తి సీరియల్‌ హర హర మహాదేవ్‌లో కొన్ని ఎపిసోడ్స్‌లో కూడా కనిపించారు.

కన్నడ, తమిళ్‌ భాషల్లో సూపర్‌హిట్‌గా నిలిచిన కొన్ని ధారావాహికల్లోనూ నటించి మెప్పించారు. కాగా ప్రముఖ భక్తి సీరియల్ హర హర మహాదేవ్‌లో కొన్ని ఎపిసోడ్స్‌లో కనిపించాడు నితిన్‌. ఇటీవల ‘ధృవ నక్షత్రం’ సీరియల్‌కి దర్శకత్వం వహించారుకూడా. మరో కొత్త సీరియల్‌ను తెరకెక్కించేందుకు కూడా సిద్ధమయ్యాడు.

అయితే శుక్రవారం రాత్రి హఠాత్తుగా గుండెపోటుతో కుప్పకూలాడు. కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకుండా పోయింది. ఆస్పత్రిలో చికిత్స పొందూతూ నితిన్‌ తుది శ్వాస విడిచారు. యువనటుడి అకాల మరణంతో శాండల్‌వుడ్‌ సినీ పరిశ్రమ దిగ్భ్రాంతికి గురైంది. ఈ విషయం తెలుసుకున్న పలువురు ప్రముఖులు, అభిమాన్లు నితిన్‌ ఫ్యామిలీకి సంతాపం ప్రకటించారు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker